#MeToo: బీసీసీఐ సీఈఓపై రాహుల్ జోహ్రీపై మరో ఫిర్యాదు

హైదరాబాద్: బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. ఇప్పటికే రాహుల్ జోహ్రీ మాజీ సహోద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాహుల్ జోహ్రీపై.. తాజాగా మరో మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై బీసీసీఐ పాలకుల కమిటీ వెంటనే చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
రాహుల్ జోహ్రీ 2001 నుంచి 2016 మధ్య డిస్కవరీ చానెల్‌లో పని చేస్తున్నప్పుడు తనను లైంగికంగా వేధించారంటూ మాజీ సహోద్యోగిని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ తన మాజీ సహుద్యోగని, ఓ రోజు తమ జాబ్‌కు సంబంధించిన విషయాలకు గురించి చర్చించడానికి వెళ్తే.. దానిని అతను అవకాశంగా తీసుకున్నాడని అక్టోబర్ నెల ఆరంభంలో ఓ మహిళ ఆరోపించింది.

ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు
తనతో మంచిగా నటిస్తూ ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని పేర్కొంది. అతని చర్యతో తనలో తను ఎంతో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జోహ్రి 2016లో బీసీసీఐ సీఈఓగా నియమితుడయ్యాడు. బీసీసీఐలో చేరకముందు ఆయన డిస్కవరీ నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్‌కు జనరల్ మేనేజర్, ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

రాహుల్ జోహ్రీ వివరణపై సంతృప్తి చెందని కమిటీ
దీంతో.. ఆ ఆరోపణలపై రెండువారాల్లోపు వివరణ ఇవ్వాలని జోహ్రిని పాలకుల కమిటీ ఆదేశించగా.. గత శనివారం అతను ఆ ఆరోపణల్ని ఖండిస్తూ తన వివరణని సమర్పించాడు. కానీ.. ఈ వివరణపై సంతృప్తి చెందని కమిటీలోని మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జి.. అతడ్ని వెంటనే సీఈఓ పదవి నుంచి తప్పించాలని అభిప్రాయపడింది.

15 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని పాలకుల కమిటీ అదేశం
అయితే, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించి విచారణ, నివేదిక తర్వాత చర్యలు తీసుకుందామని సోమవారం జరిగిన సమావేశంలో ఆమెకి కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రాకేశ్ శర్మ ఛైర్మన్‌గా, ఢిల్లీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ బరాఖ్ సింగ్, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ వర్మతో ఓ కమిటీని ఏర్పాటు చేసి 15 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని పాలకుల కమిటీ ఆదేశించింది.
ముంబై జట్టు మాజీ కెప్టెన్ షిషీర్ హట్టాంగడి ట్విట్టర్‌లో
ఒకవైపు ఈ విచారణ జరుగుతుండగానే, మరో మహిళ రాహుల్ జోహ్రిపై లైంగిక ఆరోపణలు చేస్తూ రాత పూర్వకంగా డయానా ఎడుల్జికి శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తన సూచన మేరకే నేరుగా ఎడుల్జికి బాధితురాలు ఫిర్యాదు చేసిందని వెల్లడించిన ముంబై జట్టు మాజీ కెప్టెన్ షిషీర్ హట్టాంగడి విచారణ కోసం అవసరమైతే తాను సాయం అందిస్తానని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications