కేఎల్ రాహుల్‌కు గోల్డెన్ ఛాన్స్: భారత్-ఏ టెస్ట్ జట్టులో చోటు

హైదరాబాద్: ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగే తొలి అనధికార టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ఇండియా-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఆంధ్ర రంజీ ఆటగాళ్లు రికీ భుయ్, కేఎస్ భరత్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే నాలుగురోజుల మ్యాచ్ కోసం 14 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.
భారత-ఏ జట్టుకు మహారాష్ట్ర ఆటగాడు అంకిత్ బావ్నె నాయకత్వం వహించనున్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా బీసీసీఐ ఎత్తివేయడంతో ఇప్పటికే రాహుల్ ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరిగిన రెండు వన్డేల్లో ఆడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7నుంచి రంజీ ఫైనల్ జరుగుతుండడంతో ఈ సీజన్‌లో ఫైనల్ చేరిన సౌరాష్ట్ర, విదర్భ జట్లకు చెందిన ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయలేదు.
భారత సీనియర్ జట్టు పేసర్లు గాయపడితే వారి స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో యువ పేసర్ అవేశ్ ఖాన్, వరుణ్ అరోన్‌కు జట్టులో చోటు కల్పించారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన వరుణ్ అరోన్ మళ్లీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని చూస్తుండగా, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అవేశ్ ఖాన్‌కు చోటు లభించింది.
ఇండియా-ఏ జట్టు :
అంకిత్ బావ్నే(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఏఆర్ ఈశ్వరన్, ప్రియాంక్ పంచాల్, రికీభుయ్, సిద్దేశ్ లాడ్, కేఎస్ భరత్(వికెట్ కీపర్)జలజ్ సక్సేనా, ఎస్ నదీం, మయాంక్ మర్కండే, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, అవేశ్‌ఖాన్, వరుణ్ అరోన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications