T20 World Cup 2022: టీమిండియా విజయంపై రాహుల్, చంద్రబాబు, జై షా ట్వీట్.. గొప్ప విజయం అంటూ కితాబు..

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణి చేసింది. పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమిండియాకు కంగ్రాట్స్ చెప్పారు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగిందని ట్వీట్ చేశారు. ఆటగాళ్లు ఒత్తిడిలో బాగా ఆడారని తెలిపారు. " పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంత ఉత్కంఠ నెలకొంది!.. ఒత్తిడిలో సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. బాగా
ఆడారు. తర్వాతి మ్యాచ్ ల్లో కూడా విజయం సాధించాలి. మున్ముందు మ్యాచ్‌లకు శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశాడు.
చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా టీమిండియాకు అభినందనాలు తెలిపారు. పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించారని కొనియాడారు. "ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ కప్ లో పాకిస్థాన్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసినందుకు టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని ట్వీట్ చేశాడు.
జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా విజయంపై స్పందించాడు. విరాట్ కోహ్లీ కాలాన్ని వెనక్కి మళ్లించాడు. అతనో ఛేజ్ మాస్టర్ అని చెప్పాడు. " కాలాన్ని వెనక్కి మళ్లిస్తోంది! ఛేజ్ మాస్టర్.. కోహ్లీ తిరిగి వచ్చాడు, అతని నైపుణ్యాలను మ్యాచ్ లో బాగా చూపాడు" అని ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
కోహ్లీ
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. కానీ కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications