న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ ద్రవిడ్ 45: పుట్టినరోజు ప్రత్యేకం, ఎన్నో మైలురాళ్లు

By Nageshwara Rao

హైదరాబాద్: భారత క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ముద్దుగా ద వాల్, మిస్టర్ డిపెండ‌బుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. బుధవారం ద్రవిడ్ తన 45వ పుట్టిన‌రోజును జరుపుకుంటున్నాడు.

 మరాఠీ ఫ్యామిలీలో జన్మించిన రాహుల్ ద్రవిడ్

మరాఠీ ఫ్యామిలీలో జన్మించిన రాహుల్ ద్రవిడ్

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మరాఠీ ఫ్యామిలీలో ద్రవిడ్ జన్మించాడు. ద్రవిడ్ పుట్టిన తర్వాత అతని ఫ్యామిలీ ఇండోర్ నుంచి కర్నాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిపోయింది. అతని తండ్రి జామ్ తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.

 చిన్నప్పుడు ద్రవిడ్‌ను అందరూ ‘జామీ' అని పిలిచేవారు

చిన్నప్పుడు ద్రవిడ్‌ను అందరూ ‘జామీ' అని పిలిచేవారు

దీంతో చిన్నప్పుడు ద్రవిడ్‌ను అందరూ ‘జామీ' అని పిలిచేవారు. అతని తల్లి ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. రాహుల్ స్కూలింగ్ బెంగళూరులోని సెయిట్ బాయిస్ హై స్కూలులో జరిగింది. ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజీలో కామర్స్‌లో పట్టా అందుకున్నాడు. రాహుల్ ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, హిందీ బాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.

 అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 ప‌రుగులు చేసిన ద్రవిడ్

అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 ప‌రుగులు చేసిన ద్రవిడ్

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక వన్డేల్లో 86 అర్ధసెంచరీలు చేసిన ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు.

 2003లో విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్న ద్రవిడ్

2003లో విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్న ద్రవిడ్

వన్డే ఫార్మాట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన‌వారిలో నాలుగోస్థానంలో ఉన్నాడు. 2003లో రాహుల్ నాగపూర్‌నకు చెందిన విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్నాడు. ద్రవిడ్‌కు ఇద్దరు కుమారులు. 2007 వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ఆ తర్వాత కెప్టెన్సీకి రాజీనామా చేసి ప్లేయర్‌గా కొనసాగాడు.

 ప్రస్తుతం ఆండర్-19 జట్టు కోచ్‌గా

ప్రస్తుతం ఆండర్-19 జట్టు కోచ్‌గా

రిటైరైన తర్వాత టీమిండియా కోచ్ పదవితోపాటు కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నా ద్రవిడ్ వాటిని స్వీకరించలేదు. ప్రస్తుతం ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. భారత క్రికెట్‌కు 16 ఏళ్లపాటు సేవలందించిన ద్రవిడ్ క్రీడా జీవితంలోని కొన్ని మైలురాళ్లు మీకోసం

లార్డ్స్ మైదానంలో అరంగేట్రం

లార్డ్స్ మైదానంలో అరంగేట్రం

టెస్టుల్లో సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు ఒకేసారి క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో అరంగేట్రం చేశారు. అరంగేట్రం టెస్టులో గంగూలీ సెంచరీ చేయగా, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులు చేశాడు.

 భారత క్రికెట్‌కు ఐదు పిల్లర్లు

భారత క్రికెట్‌కు ఐదు పిల్లర్లు

ఇండియన్ క్రికెట్‌కు ఐదురుగు పిల్లర్లుగా భావించే అనిల్ కుంబ్లే, సౌరభ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో రాహుల్ ద్రవిడ్.

 రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న రాహుల్ ద్రవిడ్. 2013లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డుని స్వీకరించాడు.

 ఐసీసీ టెస్టు, ఐసీసీ ప్లేయర్ అవార్డులు

ఐసీసీ టెస్టు, ఐసీసీ ప్లేయర్ అవార్డులు

2004లో ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెట్ ద్రవిడ్.

Story first published: Thursday, January 11, 2018, 16:34 [IST]
Other articles published on Jan 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X