Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్‌కు అరుదైన గౌరవం: భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌‌గా

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీసీఐ సెక్రటరీ అనురాగ్‌ ఠాకూర్‌ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించాడు.

'భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా పని చేసేందుకు ద్రావిడ్‌ అంగీకరించాడు. నిజంగా ఇది శుభవార్తేన'ని అనురాగ్ ఠాకూర్‌ అన్నాడు. సమకాలీన భారత క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందిన సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లను తగిన విధంగా వినియోగించుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జగ్మోహాన్ దాల్మియా చెప్పిన సంగతి తెలిసిందే.

Rahul Dravid to coach India 'A' and Under-19 teams

42 ఏళ్ల ద్రావిడ్‌ భారత్‌ తరఫున 164 టెస్ట్‌లు, 344 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్ధాన్ రాయల్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నారు. రాహుల్‌ను టీమిండియా కోచ్‌గా నియమించాలని బీసీసీఐ గట్టిగా ప్రయత్నించినా... కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ ఆఫర్‌ను రాహుల్ ద్రవిడ్‌ తిరస్కరించినట్టు తెలుస్తోంది.

భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించడంతో టీమిండియాకు భావి క్రికెటర్లను తీర్చిదిద్దే బాధ్యతను భుజానికెత్తుకోనున్నాడు. దీంతో పాటు భారత్‌-ఏ విదేశీ పర్యటనలపై కూడా ద్రవిడ్ ప్రత్యేకించి తన దృష్టిని పెట్టనున్నట్లు సమాచారం.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+