Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా బౌలర్‌గానే ఎక్కువ అవసరం కానీ కెప్టెన్‌గా కూడా కావాలి : రాహుల్ ద్రావిడ్

Rahul Dravid supports And Believes Jasprit Bumrah Captaincy

ఇంతకుముందు ఫస్ట్‌ క్లాస్ గేమ్‌లో కూడా టెస్ట్ కెప్టెన్‌గా పనిచేయని జస్ప్రీత్ బుమ్రా తొలిసారి ఏకంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే కీలకమైన రీషెడ్యూల్ అయిదో టెస్ట్‌లో టీమిండియాకు అతను కెప్టెన్సీ వహిస్తున్నాడు. గురువారం ఉదయం రోహిత్ శర్మకు కోవిడ్ టెస్ట్ చేయగా.. మళ్లీ పాజిటివ్ రావడంతో కెప్టెన్సీ పగ్గాలు బుమ్రా చేతికొందాయి. బుమ్రాతో తాను మాట్లాడానని, కెప్టెన్‌గా కాకుండా బౌలర్‌గా జట్టుకు అతని అవసరం ఎక్కువగా ఉంటుందని టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు.

తనదైన మార్క్ చూపించగలడు

తనదైన మార్క్ చూపించగలడు

'బుమ్రా మంచి ఆలోచనాపరుడు. అతను తన ఆట గురించి ఆలోచిస్తాడు. అతను ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. అతను ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. జట్టు నాయకుడిగాను అతను రాణించగలడని నేను ఆశిస్తున్నాను. కెప్టెన్సీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడని, బౌలింగ్ మార్పుల్లో తనదైన మార్క్ చూపించగలడని' సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ద్రావిడ్ అన్నారు.

అతనికి మా సపోర్ట్ ఉంటది

అతనికి మా సపోర్ట్ ఉంటది

'అతను మరింత మెరుగవుతున్నాడు. అతను చాలా వరకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు కాబట్టి ఇది సవాలనే చెప్పాలి. కానీ మేము అతనికి మద్దతిస్తాం. ఫాస్ట్ బౌలర్‌కు కెప్టెన్‌గా ఉండటం అంత సులభం కాదు. అతని తన సొంత బౌలింగ్ మీద కన్సస్ట్రేషన్ చేయాలి. అలాగే ఫీల్డింగ్ సెట్ చేయాలి. గత రెండు రోజులుగా నేను అతనితో సంభాషించా. మనకు అతను కెప్టెన్‌గా కాకుండా బౌలర్‌గా చాలా అవసరం. కానీ కెప్టెన్ చేసినా పెద్ద ఫరాకు పడాదని నేను అనుకుంటున్నా' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

 ఎక్కడైనా బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలర్లున్నారు

ఎక్కడైనా బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలర్లున్నారు

'ఇంగ్లాండ్ బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. మేము కూడా వాళ్ల బ్యాటింగ్ గురించి చాలానే విన్నాం. అయినా మాకు మంచి సీమర్లున్నారు. గత 4-5ఏళ్లుగా.. అన్ని రకాల పరిస్థితుల్లోనూ బౌలింగ్ చేయగల ఫాస్ట్ బౌలర్లను మా టీంలో ఉండేలా చూసుకున్నాం. ఇది ఒక ఉత్తేజకరమైన పోటీ కానుంది. మా బాయ్స్ దీనికి సిద్ధంగా ఉన్నారు.' అని ద్రావిడ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో విజయం సాధించినా, డ్రా చేసుకున్నా.. 2007 తర్వాత ఇంగ్లాండ్‌లో భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలిచినట్లవుతుంది.

తుది జట్లు :

తుది జట్లు :

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్(కీపర్), జాక్ లీచ్, మ్యాటీ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Story first published: Friday, July 1, 2022, 17:34 [IST]
Other articles published on Jul 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+