Rahul Dravid : ఎవరున్నా లేకున్నా జట్టు విషయంలో ఇబ్బందేం లేదు.. మా ప్లేయింగ్ 11 ఎవరో మాకు తెలుసు

భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ రాబోయే టీ20 ప్రపంచకప్ 2022కి ముందు.. ప్రస్తుత టీం స్ట్రెంత్స్, స్కిల్స్ బాగున్నాయని, ఆ విషయంలో తాను సంతోషంగా ఉన్నానని తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా గాయపడిన వార్త వెలువడినప్పటి నుంచి భారత జట్టు బౌలింగ్ లైనప్ విషయంలో మళ్లీ ఆందోళన నెలకొంది. ఇక చాలా మంది మాజీలు, అభిమానులు సైతం టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా లేకపోవడం చాలా లోటు అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే ద్రావిడ్ మాత్రం బుమ్రా ఇంజూరీ గురించి ఏమాత్రం ప్రస్తావించకుండానే చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రపంచకప్‌కు ముందు టీం మేనేజ్‌మెంట్ వెతుకుతున్న స్కిల్స్, బలాలు ఉన్న ప్లేయర్లు అందుబాటులో ఉన్నారని ద్రావిడ్ స్పష్టం చేశాడు.

డెత్ ఓవర్లలో లోటు
ఆసియాకప్ టోర్నీలో బుమ్రా గైర్హాజరీ స్పష్టంగా కన్పించింది. సూపర్ 4రౌండ్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌లపై 170కంటే ఎక్కువ స్కోర్లను ఇండియా డిఫెండ్ చేసుకోలేకపోయింది. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఇటీవల మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 209పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కూడా భారత బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు.
దీంతో భారత బౌలింగ్ లైనప్ గురించి విమర్శలు తీవ్రమయ్యాయి. డెత్ ఓవర్లలో బుమ్రా టీమిండియాకు ఎంతో కీలకమైన ప్లేయర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అతను లేకుండా మేనేజ్‌మెంట్ కచ్చితంగా సరైన బౌలింగ్ లైనప్‌ను ఏర్పరుచుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతుంది.

ముందుగానే చెప్పలేం
బౌలింగ్ కలయికలపై ద్రావిడ్ మాట్లాడుతూ.. 'మాకు జట్టు కూర్పు విషయంలో గానీ, బౌలింగ్ కలయిక విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. జట్టు ప్లేయింగ్ 11లో ఆడే ప్లేయర్ల విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అయితే నెల ముందుగానే ఎవరు బౌలింగ్ లైనప్‌లో బ్యాటింగ్ లైనప్‌లో ఉంటారో ముందుగానే చెప్పలేము.
పిచ్ పరిస్థితులు, ప్లేయర్ అవసరం తదితర కారణాల వల్ల ప్లేయర్ల ఎంపిక ఉంటుంది. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌కు మాకు కావాల్సిన నైపుణ్యాల గురించి మేము చాలా స్పష్టంగా ఉన్నాను. గాయంతో ఎవరైనా దూరమైన ఇబ్బంది లేకుండా.. మేమ వివిధ రకాల బౌలర్లు, బ్యాటర్లను కలిగి ఉన్నాము.' అని శనివారం ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ద్రావిడ్ చెప్పాడు.

కొంచెం రిథమ్ రావడానికి టైం పడుతుందంతే
భారత బౌలర్లలో హర్షల్ పటేల్ విషయంలో కూడా కొంచెం సందేహాలున్నాయి. అతను ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20లలో 12.37 పేలవమైన ఎకానమీ రేటుతో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో మాత్రం 26పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ ప్రదర్శన గురించి ద్రావిడ్ మాట్లాడుతూ.. 'హర్షల్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్.
గత రెండేళ్లుగా అతని ప్రదర్శనలను పరిశీలిస్తే.. అతను బెంగళూరు ఫ్రాంచైజీకి ఎలా ఆడాడో మనం చూశాం. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా తన బెస్ట్ ఇస్తాడని భావిస్తున్నా. గాయం నుంచి కోలుకున్నాక అతను బాగా ప్రిపేర్ అవుతున్నాడు. కొంచెం రిథమ్ పొందడానికి టైం పడుతుంది' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications