Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత జట్టుకు ఎంపికైన ద్రవిడ్ కొడుకు..ఆస్ట్రేలియా సిరీస్‌తో ‘జూ. వాల్’ ఎంట్రీ!

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌లకు జూనియర్ ద్రవిడ్ సెలక్ట్ అయ్యాడు. సెప్టెంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా అండర్-19 టీమ్‌తో భారత్ యువ జట్టు మూడు వన్డేలు, రెండు.. నాలుగు రోజుల టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత యువ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది.

పుదుచ్చేరి వేదికగా వన్డే సిరీస్, చెన్నై వేదికగా మల్టీ డే మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, వన్డే సిరీస్‌కు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అమాన్ కెప్టెన్‌గా, గుజరాత్‌కు చెందిన రుద్ర పటేల్ వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యారు. రెడ్ బాల్ క్రికెట్‌కు మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వర్ధన్ సారథిగా, పంజాబ్‌కు చెందిన విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

కాగా, సమిత్ ద్రవిడ్ మిడిలార్డర్ బ్యాటర్. ఇటీవల సీనియర్ మెన్స్ టీ20 టోర్నమెంట్ అయిన మహారాజ టీ20 ట్రోఫీలో పాల్గొన్నాడు. మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 114 స్ట్రైక్‌రేటుతో 82 పరుగులు చేశాడు.

Rahul Dravid s Son Samit Dravid Selected for Indian U-19 Team

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత అండర్-19 జట్టు:
మహ్మద్ అమాన్ (కెప్టెన్), రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), సాహిల్ పరాఖ్, కార్తికేయ, కిరణ్ చోర్మలే , అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ , నిఖిల్ కుమార్ , చేతన్ శర్మ , హార్దిక్ రాజ్ , రోహిత్ రాజావత్ , మహ్మద్ ఈనాన్

ఆస్ట్రేలియా నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత అండర్ 19 జట్టు:
వైభవ్ సూర్యవంశీ, నిత్య పాండ్య, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), కార్తికేయ, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), చేతన్ శర్మ, సమర్థ్ , ఆదిత్య రావత్, నిఖిల్ కుమార్, అన్మోల్జీత్ సింగ్ (PCA), ఆదిత్య సింగ్, మహ్మద్ ఈనాన్.

Story first published: Saturday, August 31, 2024, 10:46 [IST]
Other articles published on Aug 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+