మళ్లీ వికెట్ల వెనుక 'ద్రవిడ్'!
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కుటుంబం నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ ఇప్పటికే వార్తల్లో నిలవగా.. ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కూడా టీమిండియా జెర్సీ ధరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంక పర్యటన కోసం ఎస్.శరత్ నేతృత్వంలోని జూనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించిన భారత అండర్-19 వన్డే జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్‌గా అన్వయ్ ద్రవిడ్‌కు చోటు దక్కింది. జులై 4 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు,రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కేవలం 17 ఏళ్ల 45 రోజుల వయసులోనే అన్వయ్ ద్రవిడ్ అండర్-19 జట్టులో స్థానం సంపాధించడం విశేషం. అయితే అన్వయ్ ఈ సెటప్‌లోకి రావడం ఇది మొదటిసారి కాదు. గత వరల్డ్ కప్ సైకిల్‌లోనే 'ఇండియా బ్లూ' జట్టు తరఫున ట్రై-సిరీస్‌లో ఒక మ్యాచ్ ఆడాడు. కానీ ఈసారి సరికొత్త అండర్-19 సీజన్ ప్రారంభం అవుతుండటంతో సెలెక్టర్లు అన్వయ్‌పై పూర్తి నమ్మకం ఉంచారు. ఒకవేళ ఈ శ్రీలంక టూర్‌లో గనుక అన్వయ్ రాణిస్తే.. భవిష్యత్తులో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ప్రధాన వికెట్ కీపర్‌గా బరిలోకి దిగే సువర్ణావకాశం అన్వయ్ ద్రవిడ్‌కు దక్కుతుంది.

తన తండ్రి రాహుల్ ద్రవిడ్ లాగే అన్వయ్ ద్రవిడ్ కూడా వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం ఆటగాడిగానే కాకుండా మంచి కెప్టెన్‌గా కూడా దేశవాళీ క్రికెట్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు సారథ్యం వహించిన అన్వయ్.. తన టీమ్‌ను క్వార్టర్ ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఆ టోర్నమెంట్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 220 పరుగులు చేశాడు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌పై 236 పరుగుల ఛేజింగ్‌లో నాలుగో స్థానంలో వచ్చి 93 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి జట్టును గెలిపించాడు. అలాగే చండీగఢ్‌పై కూడా 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక అంతకంటే ముందు 2024లో రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ సైతం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయం కారణంగా అతను ఆ మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. ఇప్పుడు చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ లంక పిచ్‌లపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. శ్రీలంకలోని ప్రముఖ స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత అండర్-19 వన్డే జట్టు ఇదే:
యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), సాగర్ విర్క్, లక్ష్య రాయ్‌చందాని (వైస్ కెప్టెన్), వినీత్ వి.కె, అర్జున్ రాజ్‌పుత్, కుశాగ్ర ఓఝా, రజత్ బఘేల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్‌జీత్ సింగ్, వుట్కూరి యశ్‌వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శావిన్ వి, కావ్య పరేష్ పటేల్, మోహిత్ ఉలావ్, ఈషాన్ సూద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications