దీపక్ చహర్‌కి రాహుల్ ద్రవిడ్ సూచనలు.. గెలుపు ఇన్నింగ్స్‌ ఆడిన బౌలర్! కలలుగన్న ఇన్నింగ్స్‌ ఇదేనట!

కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా యువ పేసర్ దీపక్‌ చహర్‌ అద్బుత ఇన్నింగ్స్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6)తో మ్యాచ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఓడిపోతున్నామన్న దశలో చహర్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4)తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 193/7తో నిలిచిన టీమిండియా చహర్‌ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 277/7తో గెలిచింది. దాంతో టీమిండియా నయా హీరోగా దీపక్ చహర్‌ని అభివర్ణిస్తున్నారు.

కోచ్ సూచనలు

కోచ్ సూచనలు

దీపక్ చహర్‌ క్రీజులోకి వెళ్లే సమయానికే భారత్ 160/6తో కష్టాల్లో నిలిచింది. అయినప్పటికీ శ్రీలంక టూర్‌లో చీఫ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. దీపక్ చహర్‌లో స్ఫూర్తి నింపి మరీ మైదానంలోకి పంపాడట. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత దీపక్ స్వయంగా వెల్లడించాడు.

దీపక్ చహర్ హాఫ్ సెంచరీ ముగియగానే డ్రెస్సింగ్ రూము నుంచి డగౌట్‌లోకి వచ్చిన ద్రవిడ్.. దీపక్ చహర్ తమ్ముడు రాహుల్ చహర్ వద్దకి వెళ్లి కొన్ని సూచనలు చేసి మళ్లీ వెళ్లిపోయాడు. అప్పుడు డ్రింక్స్ బాయ్‌గా పనిచేస్తున్న రాహుల్ చహర్.. అనంతరం మైదానంలోకి వెళ్లి ద్రవిడ్ సూచనల్ని తన అన్నకు వివరించాడు. ఇదే విషయాన్ని దీపక్ మ్యాచ్ అనంతరం మీడియాకు వెల్లడించాడు.

ద్రవిడ్ సర్‌ నమ్మకం ఉంచారు

ద్రవిడ్ సర్‌ నమ్మకం ఉంచారు

'దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్‌ ద్రవిడ్ సర్‌ చెప్పారు. ఆయన కోచింగ్‌లో నేను భారత్‌-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడాను. ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్‌ రాదనే అనుకుంటున్నా.

లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకుముందు మాత్రం ఒక్కో బంతిని ఆడుతూ పరుగులు చేశా. ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా. చివరకు అది జరిగింది' అని దీపక్ చహర్‌ అన్నాడు.

IND vs SL: ఓడిపోయే మ్యాచులో గెలిచిన యువ భారత్.. ధావన్ సేన గెలుపుకు అసలు కారణాలు ఇవే!

చహర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

చహర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. చరిత అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. చమిక కరుణరత్నె (44 నాటౌట్‌), భానుక రాజపక్స (36), ధనంజయ డిసిల్వా (32) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్, యుజ్వేంద్ర చహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో అసమాన పోరాటం కనబర్చిన దీపక్‌ చహర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం ఇక్కడే జరుగనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 21, 2021, 11:17 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X