Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : వన్డే ఫార్మాట్ నేర్చుకుంటున్నాడు.. సూర్యకు సమయం ఇవ్వాలి: ద్రావిడ్

Rahul Dravid says Suryakumar Yadav is learning ODI format

ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక మూడో వన్డే కోసం భారత జట్టు చెన్నై చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియాలో దారుణంగా ఫెయిలవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ సిరీస్ మొదటి రెండు వన్డేల్లో సూర్యకుమార్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని వన్డేల్లో కొనసాగించాలా? వద్దా? అని కొందరు చర్చిస్తున్నారు. దీనిపై పెదవి విప్పిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్.. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడిప్పుడే వన్డే ఫార్మాట్ ఆడటం నేర్చుకుంటున్నాడని చెప్పాడు.

టీ20ల్లో టాప్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. వన్డేల్లో ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. అయితే అతను ఆడిన వన్డేలు కూడా తక్కువే. ఇప్పటి వరకు కేవలం 22 వన్డేలు మాత్రమే ఆడిన అతను.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం 48 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. ఇదే విషయం గుర్తు చేసిన ద్రావిడ్.. వన్డే ఫార్మాట్‌లో ఎక్కువగా ఆడే అవకాశం సూర్యకు దక్కలేదని చెప్పాడు. 'సూర్య గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. అతను ఎదుర్కొన్న రెండు బంతులు చాలా మంచి డెలివరీలు. సూర్య విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. అతను ఇంకా 50 ఓవర్ల ఫార్మాట్‌ ఆడటం నేర్చుకుంటున్నాడు' అని చెప్పాడు.

టీ20 ఫార్మాట్ కొంత భిన్నంగా ఉంటుందని, సూర్య ఐపీఎల్‌లో కూడా పదేళ్లు ఆడాడని ద్రావిడ్ గుర్తుచేశాడు. 'సూర్య చాలా టీ20 క్రికెట్ ఆడాడు. తీవ్రమైన ఒత్తిడి ఉండే మ్యాచులు ఆడాడు. అయితే వన్డేలకు దేశవాళీ స్థాయిలో ఇలాంటి ఒత్తిడి కలిగించే టోర్నమెంట్లు లేవు. విజయ్ హజారే ట్రోఫీ మాత్రమే ఉంది. ఇంత టీ20 క్రికెట్ ఆడినా కూడా సూర్య కావలసినంత వన్డే క్రికెట్ ఆడలేదు. అతనికి మరికొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంచెం సహనంగా ఉంటే అతను మళ్లీ రాణించడం చూస్తాం' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, March 22, 2023, 7:54 [IST]
Other articles published on Mar 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+