ద్రవిడ్ కొడుకా.. మజాకా.. 2నెలల్లో 2 డబుల్‌ సెంచరీలు!!

ముంబై: రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. మైదానంలో పరుగుల మోతతో తండ్రికి పుత్రోత్సాహం కలిగిస్తున్నాడు. రెండు నెలల వ్యవధిలోనే రెండో డబుల్‌ సెంచరీ చేసి ఔరాఅనిపించాడు.

33 ఫోర్లతో..

33 ఫోర్లతో..

మాల్యా అదితి అంతర్జాతీయ పాఠశాల తరఫున ఆడుతున్న సమిత్ ద్రవిడ్.. అండర్‌-14 బీటీఆర్‌ షీల్డ్‌ మ్యాచులో శ్రీ కుమారన్‌ జట్టుపై డబుల్ సెంచరీ సాధించాడు. 33 ఫోర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. దీంతో మాల్యా టీమ్ 3 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఛేజింగ్‌లోనూ బంతితో రాణించాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లు కూడా చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా సమిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మాల్యా జట్టు 267 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

టమాట, ఉల్లిగడ్డల వ్యాపారం చేయగలిగినప్పుడు క్రికెట్ ఎందుకు ఆడొద్దు : అక్తర్

అండర్‌-14 జోనల్‌ టోర్నీలో..

అండర్‌-14 జోనల్‌ టోర్నీలో..

గతేడాది డిసెంబ‌ర్‌లో జరిగిన అండర్‌-14 స్టేట్ లెవెల్ టోర్నీల్లోనూ సమిత్‌ ద్రవిడ్‌ అద్బుత ప్రదర్శన కనబర్చాడు. కోల్‌కతాలో జరిగిన అండర్‌-14 జోనల్‌ టోర్నీలో వైస్‌ ప్రెసిడింట్స్‌ ఎలెవన్ తరఫున ధార్వాడ్‌ జోన్‌పై 201 పరుగులు చేశాడు. 256 బంతులు ఆడిన అతడు 22 బౌండరీలు బాదాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బంతితోను రాణించి 3 వికెట్లు తీశాడు. గతంలోనూ శతకాలు బాదిన సమిత్‌ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే సమిత్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసినట్లయింది.

2015లో తొలిసారి..

2015లో తొలిసారి..

2015లో ఈ చిచ్చరపిడుగు పేరు తొలి సారి వినిపించింది. ఆ ఏడాది అండర్-12 క్రికెట్‌లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున సమిత్ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇవన్నీ తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో తొలిసారి అతని పేరు మారుమోగింది.

తండ్రిబాటలో తనయుడు..

తండ్రిబాటలో తనయుడు..

ఇక 2016లో బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్‌కు ఆడిన సమిత్.. ఫ్రాంక్ ఆంటోని స్కూల్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 125 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఆ 30 ఓవర్ల మ్యాచ్‌లో ప్రత్యూష్ జీ(143)తో కలిసి నాలుగో వికెట్‌కు 213 పరుగులు జోడించి 246 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించాడు. ఈ రికార్డు భాగస్వామ్యంతో తన తండ్రిని గుర్తు చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, February 18, 2020, 20:07 [IST]
Other articles published on Feb 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X