Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

22 ఫోర్లు: డబుల్ సెంచరీతో మెరిసిన రాహుల్ ద్రవిడ్ కొడుకు

Rahul Dravids son Samit scores sensational double century in Under-14 state-level match

హైదరాబాద్: మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. సమిత్ ద్రవిడ్ జూనియర్ లెవల్ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. అండర్-14 రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లో సమిత్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.

అండర్‌-14 జోనల్‌ టోర్నమెంట్లో వైస్‌ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 14 ఏళ్ల సమిత్‌ ద్రవిడ్ ధార్వాడ జోన్‌పై 256 బంతుల్లో 22 ఫోర్లతో 201 పరుగులు సాధించాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగి 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు.

సమిత్ ద్రవిడ్ అల్ రౌండ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ టీమిండియా అండర్-19 జట్టును పర్యవేక్షించడంతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్నారు. సమిత్ ద్రవిడ్ డబుల్ సెంచరీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Saturday, December 21, 2019, 8:10 [IST]
Other articles published on Dec 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+