
131 బంతుల్లో 166 పరుగులు:
మాల్యా అదితి ఇంట్నేషనల్ స్కూల్, విద్యాశిల్ప్ అకాడమీ జట్ల జట్ల మంగళవారం మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన మాల్యా జట్టు 50 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. సమిత్ ద్రవిడ్ 131 బంతుల్లో 166 పరుగులు చేశాడు. దీనిలో 24 బౌండరీలు ఉన్నాయి. సమిత్‌తో పాటు అన్వయ్ కూడా 90 పరుగులతో మెరిశాడు. ఈ ఇద్దరు విద్యాశిల్ప్ బౌలర్లపై విరుచుకుపడడంతో మాల్యా భారీ స్కోర్ చేసింది.

నాలుగు వికెట్లతో చెలరేగిన సమిత్:
అనంతరం బరిలోకి దిగిన విద్యాషిల్స్ 38.5 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. సమిత్ 35 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సమిత్ ఆల్‌రౌండ్ షో చేసి తమ జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ సెమీఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. సమిత్ బ్యాటింగ్‌పై మాల్యా అదితి ఇంట్నేషనల్ స్కూల్ ప్రశంసలు కురిపించింది.

ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు:
అంతకుముందు ఇదే టోర్నమెంట్‌లో సమిత్ ద్విశతకం బాదిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న 14 ఏళ్ల సమిత్ శ్రీ కుమరన్ చిల్డ్రన్స్ అకాడమీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 146 బంతుల్లో 33 బౌండరీలతో ఈ ద్విశకతం బాదాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ సమిత్ రాణించాడు. కోల్‌కతాలో జరిగిన అండర్-14 జోనల్ టోర్నీలో వైస్ ప్రెసిడింట్స్ XI తరఫున ధార్వాడ్ జోన్‌పై 201 పరుగులు చేశాడు. 256 బంతుల్లో 22 బౌండరీలతో డబుల్ బాదాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనే అజేయంగా 94 పరుగులు చేసాడు.


Click it and Unblock the Notifications
