Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా బ్యాటింగ్‌ను ఫాలో కావొద్దు: పంత్, శాంసన్‌లకు ద్రవిడ్

హైదరాబాద్: తాను బ్యాటింగ్ చేస్తున్న వీడియోలను ఎక్కువగా చూడొద్దని, తదుపరి మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలవాలని ఢిల్లీ మెంటార్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన సలహాతో రిషబ్ పంత్‌, సంజూ శాంసన్ చెలరేగారు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 208 పరుగులు చేసింది. ఆ తర్వాత 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయింది. కానీ సంజూ శాంసన్ (31 బంతుల్లో 61 పరుగులు), రిషబ్ పంత్ (43 బంతుల్లో 97 పరుగులు) రాణించడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.

షబ్ పంత్, సంజూ శాంసన్‌లపై ప్రశంసల జల్లు

షబ్ పంత్, సంజూ శాంసన్‌లపై ప్రశంసల జల్లు

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. వీరిద్దరూ అద్భుతంగా ఆడటం పట్ల ఢిల్లీ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ మైక్రోఫోన్‌తో పంత్, శాంసన్‌లను ఇంటర్యూ చేశాడు.

నా బ్యాటింగ్‌ను ఫాలో కావొద్దని సలహా

ఈ సందర్భంగా 'నా బ్యాటింగ్‌ను ఫాలో కావొద్దని వారికి ద్రవిడ్ సలహా ఇచ్చాడట. నేను బ్యాటింగ్ చేస్తున్న వీడియోలను ఎక్కువగా చూడొద్దని ఇండియన్ క్రికెట్ వాల్ సలహా ఇచ్చాడు. తదుపరి మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలవాలి' అని పంత్‌కు సూచించాడు.

ఓవర్ల మధ్యలో మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారా

ఓవర్ల మధ్యలో మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారా

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓవర్ల మధ్యలో మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారా అని రాహుల్ ద్రవిడ్... పంత్, శాంసన్‌లను ప్రశ్నించాడు. ఇందుకు పంత్ లేదని బదులిచ్చాడు. బౌలర్ ఎవరో చూడొద్దని, చెత్త బంతి పడితే దాన్ని బాదమని శాంసన్‌కు చెప్పానని అన్నాడు.

పంత్ మాటలు మంత్రంలా పనిచేశాయి

పంత్ మాటలు మంత్రంలా పనిచేశాయి

తాను రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత సింగిల్స్ తీద్దామని భావించానని.. అయితే పంత్ దగ్గరకొచ్చి.. భయ్యా మరీ ఎక్కువగా ఆలోచించకు తర్వాతి బాల్ గురించి ఎందుకు.. ఈ బంతినే బాదేయ్ అన్నాడని శాంసన్ చెప్పాడు. పంత్ మాటలు మంత్రంలా పనిచేశాయేమో.. శాంసన్ ఒక్క ఫోర్ కూడా కొట్టకుండానే.. ఈ మ్యాచ్‌లో ఏడు సిక్సర్లతో చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సర్లు

ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సర్లు

తద్వారా బౌండరీలు బాదకుండూ ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నితీశ్ రాణా సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 9 సిక్స్‌లు బాదగా ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, కోరె అండర్సన్ చెరో రెండు సిక్సర్లతో ఢిల్లీకి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 31 సిక్సర్లు నమోదయ్యాయి. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు రికార్డయిన మ్యాచ్ ఇదే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+