సవాల్ విసిరాడు: గ్రేటెస్ట్ బౌలర్ అతడే అన్న ద్రవిడ్
హైదరాబాద్: తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న బౌలర్లలో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. అతను కేవలం ఆస్ట్రేలియన్ గ్రేటెస్ట్ బౌలరే కాదు.. గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ అంటూ ద్రవిడ్ కొనియాడాడు.
తన కెరీర్‌లో ఆసీస్ పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని ఎన్నో సెంచరీలు నమోదు చేసినా మెక్ గ్రాత్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సాములా ఉండేదని పేర్కొన్నాడు. 43 ఏళ్ల రాహుల్ ద్రవిడ్ తన క్రికెట్ కెరీర్‌లో 164 టెస్టు మ్యాచ్‌లాడి ప్రపంచంలలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా నిలిచాడు.

తాను ఎదుర్కొన్న గ్రేటెస్ట్ బౌలర్ అతడే
'నా తరంలో ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెట్ జట్టు. అప్పటి జట్టు చాలా బలంగా ఉండేది. అలాగే నేను ఎదుర్కొన్న అందరిలో గొప్ప ఫాస్ట్ బౌలర్ మెక్‌గ్రాత్. అతను చాలా తెలివైన వాడు. అతనొక ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ బౌలరే కాదు.. నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్' అని ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్ పేర్కొన్నాడు.

మెక్‌గ్రాత్ అసాధారణ నైపుణ్యమున్న బౌలర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో మెక్‌గ్రాత్ అసాధారణ నైపుణ్యమున్న బౌలర్ అని ద్రవిడ్ కొనియాడాడు. 'నా ఆఫ్ స్టంప్ పరిజ్ఞానాన్ని గ్లెన్‌లా ఎవరూ సవాల్ చేయలేదు. అతను ఎవ్వరిపైనా కనికరం చూపడు. మ్యాచ్ తొలి గంటలో బౌలింగ్ చేసినా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా పరుగులు మాత్రం ఇవ్వడు. ఎంతో కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు' అని ద్రవిడ్ అన్నాడు.

ఆస్ట్రేలియాపైనే ద్రవిడ్ ఎక్కువ పరుగులు
తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపైనే ద్రవిడ్ ఎక్కువ పరుగులు చేయడం విశేషం. 2004, అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్‌ను మెక్ గ్రాత్ డకౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 9 బంతులాడిని ద్రవిడ్ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు.

124 టెస్టులాడిన మెక్‌గ్రాత్ 563 వికెట్లు
ఈ టెస్టు మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 217 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన మెక్‌గ్రాత తన కెరీర్‌లో 124 టెస్టుల్లో 563 వికెట్లు, 250 వన్డేల్లో 81 వికెట్లు తీసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications