
అయినా ఎప్పుడో జరిగిన విషయాల పైన తనకు ఇప్పుడు ఆసక్తి లేదని చెప్పారు. ఈ సంచలనాత్మక విషయాల నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ పుస్తకాన్ని చదువుతారా అని విలేకరులు అడిగినప్పుడు.. ఇలాంటివి చదవడానికి తాను ఎదురు చూడటం లేదని వ్యాఖ్యానించారు.
కానీ బ్యాట్స్‌మన్‌షిప్, తాను అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కావడానికి దోహదపడ్డ అంశాలు వంటి వాటి పైన అతడు రాసేది చదువుతానని ద్రావిడ్ చెప్పారు. కాగా, ద్రవిడ్‌ను తప్పిద్దామని గ్రెగ్ చాపెల్ తనతో అన్నాడని సచిన్ టెండుల్కర్ ఆత్మకథలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే. దీని పైన ద్రవిడ్ స్పందించారు.
సుప్రీం కోర్టుకు ముద్గల్ తుది నివేదిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో గత ఏడాది చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ నిర్వహించిన ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు తుది నివేదికను సీల్డ్ కవర్‌లో అందించింది. ఫిక్సింగ్ కేసులో న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, ఇబ్రహీం కలిఫుల్లా సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు బెంచ్ ఈ నెల 10న తీర్పును ఇవ్వనుంది.
కాగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్ మరోసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్ష స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది సుప్రీం కోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఆధారపడింది. ఈ కారణంగానే ముద్గల్ కమిటీ తన నివేదికలో ఏం పేర్కొందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.