INDvsAUS : వరల్డ్ కప్ జట్టుపై క్లారిటీ.. ఇప్పటికి 16-18 మందిని సెలెక్ట్ చేశాం: ద్రావిడ్

ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌ను ఎలాగైనా గెలవాలని టీమిండియా ఆశిస్తోంది. సగటు అభిమాని కూడా అదే ఆశ పడుతున్నాడు. అయితే ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో భారత జట్టు ఆటతీరు చూస్తే మాత్రం కొంత ఆందోళన కలుగుతోంది. ఆస్ట్రేలియా వంటి క్వాలిటీ జట్టును ఎదుర్కొనే సమయంలో భారత జట్టు తేలిపోతోంది. వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే నెగ్గినా.. భారత బ్యాటింగ్ కష్టాలు స్పష్టంగా కనిపించాయి.
ఇక విశాఖ వన్డే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ క్రమంలో భారత జట్టు సెలెక్షన్‌ను కూడా నిపుణులు, ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. వన్డేల్లో నిలకడగా రాణిస్తూ వచ్చిన సంజూ శాంసన్‌ను పక్కన పెట్టేసి, టీ20 స్పెషలిస్టు అయిన సూర్యకుమార్‌కు అవకాశాలు ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంచలన విషయం వెల్లడించాడు. వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టు ఏదో ఆ జాబితా దాదాపుగా రెడీ అయిపోయిందని ద్రావిడ్ చెప్పాడు.
వరల్డ్ కప్ ఉన్న ఈ ఏడాదిలో భారత జట్టును గాయాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. బుమ్రా, పంత్, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులంతా గాయాలతో జట్టుకు దూరమైన వారే. అయినా సరే ప్రస్తుతానికి జట్టు మానసికంగా మంచి స్థానంలో ఉందన్న ద్రావిడ్.. వరల్డ్ కప్‌లో ఆడించే 16-18 మంది ఆటగాళ్లపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చామని చెప్పాడు. 'భారత పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం ఇక లేదు. అయితే ఇక్కడ ఆడే అవకాశం రావడం చాలా గొప్ప. ఇక ఐపీఎల్‌ను చూడాలి. అయితే వరల్డ్ కప్‌లో ఎలాంటి జట్టు కావాలో మాకు ఒక అంచనా ఉంది. ప్రస్తుతానికి 16-18 మంది ఆటగాళ్ల వరకు సెలెక్ట్ చేశాం. వారిపై బాగా ఫోకస్ పెట్టాం' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications