For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: పాత గూటికి రాహుల్ ద్రవిడ్!

భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి గుడ్‌బై చెప్పిన రాహుల్ ద్రవిడ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. మెగా వేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. యువ క్రికెటర్ల ఎంపిక, తుది జట్టు కూర్పు, జట్టును బలోపేతం చేయడంతో ద్రవిడ్‌కు అపారమైన అనుభవం ఉంది. సీనియర్ జట్టుతో పాటు అండర్-19 టీమిండియాకు ద్రవిడ్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.

ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందే ద్రవిడ్‌ను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని కొన్ని జట్లు భావిస్తున్నాయి. మెగా వేలం జరగనుండటంతో ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లను వదులుకోవాల్సి ఉంటుంది. తిరిగి వేలంలో జట్టును నిర్మించుకోవాలి. ఇది ఎంతో కీలకమైన ప్రక్రియ. మెగావేలం తర్వాత కొన్ని జట్లు బలంగా, మరికొన్ని బలహీనంగా మారే దశ.

Rahul Dravid Likely to Return as Rajasthan Royals Head Coach in IPL

దీంతో కోచ్‌గా లేదా మెంటార్‌గా ద్రవిడ్‌ను ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ద్రవిడ్‌కు భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ఇప్పటికే ఈ టీమిండియా మాజీ కోచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సంప్రందించిందని సమాచారం. అయితే తాజాగా ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ చర్చలు జరుపుతుంది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకోవాలని కోరింది. మరోవైపు ఆర్‌ఆర్‌లోకి తిరిగి రావడానికి ద్రవిడ్ కూడా సుముఖంగా ఉన్నాడని జాతీయ మీడియా పేర్కొంది.

ఐపీఎల్‌లో ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ తరఫున ద్రవిడ్ ఆడాడు. అయితే బెంగళూరుతో పాటు రాజస్థాన్‌కు కూడా వాల్ సారథి బాధ్యతలు నిర్వర్తించాడు. కాగా, 2012, 2013 సీజన్లలో రాజస్థాన్ జట్టును చక్కగా నడిపించాడు. 2013 సీజన్‌లో జట్టును మూడో స్థానంలో నిలిపాడు. అదే ఏడాది ఛాంపియన్స్ లీగ్‌లో జట్టును ఫైనల్‌‌కు చేర్చాడు. 2013లో ఆటగాడిగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ద్రవిడ్ ఆ తర్వాత మెంటార్‌గా ఆర్ఆర్‌తో 2015 వరకు కొనసాగాడు.కాగా, ప్రస్తుతం కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Story first published: Tuesday, July 23, 2024, 9:17 [IST]
Other articles published on Jul 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+