హైదరాబాద్: ఇండియా ఏ, అండర్ 19 జట్లకు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ని కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే రాహుల్ ద్రవిడ్ త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 భారత జట్టుకి దూరం కానున్నాడు. జులై 5 నుంచి భారత అండర్-19 జట్టు ఈ పర్యటనకు వెళ్లనుంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఇంగ్లాండ్ పర్యటనకు ఎందుకు వెళ్లడంలేదని పలువురు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందించారు. జులైలో ఇండియా ఏ జట్టు ముక్కోణపు వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం ద్రవిడ్ భారత్ ఏతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఇండియా ఏ జట్టు వన్డే మ్యాచ్‌లతో పాటు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది.
ఈ కారణం వల్లే ద్రవిడ్ అండర్-19 జట్టుతో ఇంగ్లాండ్ వెళ్లలేకపోతున్నాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. జులై 26వ తేదీన ఆస్ట్రేలియా ఏ జట్టుతో భారత్ జట్టు తలపడే మ్యాచ్‌తో ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇలా మూడు దేశాల ముక్కోణపు వన్డే సిరిస్ ఆగస్టు 8వరకు జరుగుతుంది.

ఆ తర్వాత ఇండియా ఏ జట్టు... దక్షిణాఫ్రికాతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులు ఆడుతుంది. ఆగస్టు 12 నుంచి 15 వరకూ బెనోనిలో తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరుగనుండగా, ఆగస్టు 19 నుంచి 22 వరకూ సెన్ స్వే పార్క్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరుగనుంది.
బీసీసీఐతో కుదుర్చుకున్న తాజా ఒప్పందం ప్రకారం రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ పదో సీజన్‌లో ద్రవిడ్ ఢిల్లీ జట్టు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఐపీఎల్‌లో ఢిల్లీ ప్రాంఛైజీ నుంచి తప్పుకున్నాడు.
ఐపీఎల్ నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో అందుకు తగ్గ పారితోషకాన్ని బీసీసీఐ ద్రవిడ్‌కి అందజేస్తోంది. ఈ రెండు సంవత్సరాల ఒప్పందానికి ద్రవిడ్‌కి బీసీసీఐ సుమారు రూ.10 కోట్లు అందించనున్నట్లు సమాచారం. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో జట్లకు కెప్టెన్లుగా సీనియర్ ఆటగాళ్లు కరుణ్ నాయర్, మనీష్ పాండేలు ఎంపికయ్యారు.
ఆతిథ్య దక్షిణాఫ్రికా ఏ రెండు అనధికార టెస్టులకు కరుణ్ నాయర్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించగా, వన్డే జట్టు కెప్టెన్‌గా మనీష్ పాండే వ్యవహరించనున్నాడు.
జట్ల వివరాలు:
వన్డే జట్టు: మనీష్ పాండే(కెప్టెన్), మన్ దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృణాల్ పాండ్యా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), విజయ్ శంకర్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, జయంత్ యాదవ్, బాసిల్ తంపి, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్ద్ కౌల్
టెస్టు జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), ప్రియంక్ పాంచల్, అభినవ్ ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ ఛటర్జీ, హనుమ విహారి, జయంత్ యాదవ్, నదీమ్, నవదీప్ సైనీ, సిరాజ్ శార్దూల్ ఠాకూర్, అంకిత్ చౌదరి, అనికిత్ చౌదరి, అంకిత్ రాజ్ పుత్
దక్షిణాఫ్రికా పర్యటనలో ఇండియా ఏ పర్యటన పూర్తి షెడ్యూల్:
| S.No | Date | Match | Venue |
| 1st OD | July 26 | India 'A' vs Australia 'A' | Groenkloof |
| 2nd OD | July 28 | South Africa 'A' vs India 'A' | Tukkies |
| 3rd OD | July 30 | South Africa 'A' vs Australia 'A' | Groenkloof |
| 4th OD | Aug 1 | India 'A' vs Australia 'A' | Tukkies |
| 5th OD | Aug 3 | South Africa 'A' vs India 'A' | Groenkloof |
| 6th OD | Aug 5 | South Africa 'A' vs Australia 'A' | Groenkloof |
| Final | Aug 8 | TBC vs TBC | Tukkies |
టెస్టు:
1st Four-day match Aug 12-15 South Africa 'A' vs India 'A' Benoni
2nd Four-day match Aug 19-22 South Africa 'A' vs India 'A' Senwes Park