For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరో ఎందుకు? డబ్బులిస్తే ఆ పని నేనే చేస్తా: ద్రవిడ్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ యువీ బయోపిక్‌ను రూపొందించనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, రవిభాగ్ చందక్‌ వెల్లడించారు. అయితే ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ బయోపిక్ అంటూ చర్చ జోరుగా సాగుతోంది.

టీ20 వరల్డ్ కప్‌ను భారత్ సాధించడంలో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ది కీలకపాత్ర. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధను అధిగమించి, ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా ఆటగాళ్లను ద్రవిడ్ సన్నద్ధం చేశాడు. టీమిండియా ఛాంపియన్‌గా నిలిచేలా వ్యూహాలు రచించాడు. కాగా, వెస్టిండీస్‌ వేదికగా 2007 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా ద్రవిడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కానీ అదే వేదికపై 17 ఏళ్ల తర్వాత కోచ్‌గా ద్రవిడ్ ప్రపంచకప్‌ను గెలవడం విశేషం. దీంతో ద్రవిడ్ బయోపిక్ సినిమా రావాలని నెట్టింట పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Rahul Dravid Jokes About Potential Biopic I ll Star as Myself for the Right Price

ఈ నేపథ్యంలో ఓ విలేఖరి అభిమానుల ఆకాంక్ష గురించి ద్రవిడ్‌కు తెలియజేశాడు. అంతేగాక బయోపిక్‌ తెరకెక్కిస్తే హీరో పాత్రలో ఎవరిని చూడాలనుకుంటున్నారని ప్రశ్నించాడు. దానికి ద్రవిడ్ సరదాగా సమాధానమిచ్చాడు. 'మంచిగా డబ్బులిస్తే.. ఆ పని నేను చేస్తాను' అని ద్రవిడ్ నవ్వుతూ బదులిచ్చాడు. కాగా, బుధవారం సియెట్ అవార్డుల ప్రదానోత్సవంలో ద్రవిడ్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాడు.

మరోవైపు కోచ్‌గా బాధ్యతలు ముగించడంతో రాహుల్ ద్రవిడ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. మెగా వేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. యువ క్రికెటర్ల ఎంపిక, తుది జట్టు కూర్పు, జట్టును బలోపేతం చేయడంతో ద్రవిడ్‌కు అపారమైన అనుభవం ఉంది. సీనియర్ జట్టుతో పాటు అండర్-19 టీమిండియాకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించడంతో ద్రవిడ్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నిస్తున్నాయి.కోచ్‌గా లేదా మెంటార్‌గా ద్రవిడ్‌ను ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

Story first published: Thursday, August 22, 2024, 18:22 [IST]
Other articles published on Aug 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+