
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, క్రికెట్ విశ్లేషకుడు వీరేంద్ర సెహ్వాగ్ భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను పొగడ్తలతో ముంచెస్తున్నాడు. అండర్ 19 కుర్రాళ్లు వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా ఆ జట్టు ప్రధాన కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్‌ను అందరూ పొగిడేస్తున్నారు. ఎప్పుడూ సెహ్వాగ్ అభినందనలు అందరిలో ప్రత్యేకంగా ఉన్నట్లే ఇప్పుడు అలానే ద్రవిడ్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ కోచ్ అంటున్నాడు.
ద్రవిడ్ అతని 16 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలిచింది లేదన్నాడు. కానీ, ఇప్పుడు కోచ్‌గా అతని కలను సాకారం చేసుకున్నాడని కొనియాడాడు. దేశానికి ప్రపంచ కప్‌ను తీసుకువచ్చాడని పేర్కొన్నాడు. శనివారం జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందన్నాడు. మంచి కోచ్‌గా అతని సత్తా ఏంటో నిరూపించుకున్నాడని తెలిపాడు.
అతను ప్రపంచంలోనే అత్యుత్తమమైన కోచ్ అని రికార్డులే చెప్తున్నాయని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌కు వరకూ వచ్చిన భారత జట్టుకు ఒత్తిడి అనేది లేకుండా చేసి జట్టును గెలిపించాడన్నాడు. ప్రతి క్రికెటర్‌కు వరల్డ్ కప్ గెలవాలనే కోరికను ద్రవిడ్ ఇలా తీర్చుకున్నాడని వ్యాఖ్యానించాడు.
వరల్డ్ కప్ ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను గెలిచిన మంజోత్ కల్రాను సెహ్వాగ్ అభినందించాడు. పృథ్వీ షా, శుబ్‌మాన్ గిల్, హార్విక్ దేశాయ్‌లు భారీ స్కోరు చేయగలరనే నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. కానీ, ఊహించని రీతిలో కల్రా సెంచరీ చేయడం ఆశ్యర్యానికి గురి చేసిందన్నాడు. మంజోత్ ఫైనల్‌లో ఏ ఒత్తిడికి లోను కాకుండా ఆడటం వల్లనే ఇది సాధ్యపడిందని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.