తప్పులు దిద్దుకున్నా, ద్రవిడ్ వల్లే ఈ స్ధాయికి: పాండ్యా
హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండర్‌గా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నా, గతేడాది స్వదేశంలో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో పేలవ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.

ద్రవిడ్ వల్లే ఈ స్ధాయికి
ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కూడా అతడు చోటు దక్కించుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్లో తిరిగి చోటు దక్కించుకోవడంలో టీమిండియా మాజీ క్రికెటర్, భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాన్పూర్‌లో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం పాండ్యా మీడియాతో మాట్లాడాడు.
తప్పులు సరిదిద్దుకొని మళ్లీ జట్టులోకి వచ్చా
తద్వారా తన తప్పులు సరిదిద్దుకొని మళ్లీ జట్టులోకి వచ్చానని పాండ్యా వ్యాఖ్యానించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అనూహ్యంగా టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న అతడు ఘోరంగా విఫలమయ్యాడు. అతడు ఆడిన అన్ని మ్యాచ్‌లు కలిపి కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
ఎంతో నేర్చుకునేందుకు అవకాశం కల్పించింది
భారత-ఎ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియాలో పర్యటించడం వల్ల తాను ఎంతో నేర్చుకునేందుకు అవకాశం కల్పించిందని చెప్పాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ఆటతో పాటు మానసికంగా కూడా తన ఆలోచనా తీరును మార్చారని తెలిపాడు. అసిస్టెంట్ కోచ్ పారస్ మాంబ్రే కూడా తనవంతు సహకారాన్ని అందించారని చెప్పాడు.
మానసికంగా పురోగతి సాధించా
ఈ సందర్భంగా భారత్-ఏ జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆటతీరుతో పాటు మానసికంగా పురోగతి సాధించడానికి రాహుల్ ద్రవిడ్ ఎంతో సాయం చేశారని తెలిపాడు. ఐసీసీ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ తర్వాత నాకు వాస్తవం తెలిసొచ్చింది. నేను ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని అర్థమైందని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications