For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొహమ్మద్ సిరాజ్ టీమిండియాలోకి రీ ఎంట్రీ..?

Rahul Dravid impressed with Mohammed Sirajs maturity

హైదరాబాద్: హైదరబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ టీమిండియాలోకి రీ ఎంట్రీకి దాదాపు సిద్ధమే అంటున్నాడు రాహుల్ ద్రవిడ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్న హైదరాబాద్ ఫేసర్ మొహమ్మద్ సిరాజ్‌ జాతీయ జట్టులో రీ-ఎంట్రీకి చేసేందుకు అన్ని అర్హతలున్నాయని టీమిండియా సీనియర్ క్రికెటర్ ద్రవిడ్ అన్నారు. సిరాజ్‌ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకునే అంశంపై సెలక్షన్ కమిటీతో టచ్‌లో ఉన్నట్లు భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా వెల్లడించాడు.

దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ 10 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచిన సిరాజ్...గత మూడు ఫస్ట్‌క్లాస్ టెస్ట్‌ మ్యాచ్‌లలో 25 వికెట్లు సాధించాడు. 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు ఎంట్రీ ఇచ్చిన సిరాజ్...ఇప్పటి వరకు ఆడిన 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 82 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ క్రమంగా మానసికంగా, శారీరకంగా మెరుగవుతున్నాడని ద్రవిడ్ అన్నాడు.

'ఫస్ట్‌క్లాస్‌లో సిరాజ్ ఆడిన మ్యాచ్‌లు తక్కువే అయినా...అతను నేర్చుకుంటూనే ఉన్నాడని అభినందించారు. ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్ట్ మ్యాచ్‌లలో 25 వికెట్లు పడగొట్టడం అద్భుతం. సిరాజ్ మానసికంగా మెరుగయ్యాడనడానికి ఇది నిదర్శనం. అతను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నాడు.' అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు.

సిరాజ్ జాతీయ జట్టుకు తిరిగి ఎంపికయ్యే అవకాశాలపై మెరుగ్గా ఉన్నాయని ద్రవిడ్ స్పష్టం చేశారు. తాము బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్(ఎంఎస్కే ప్రసాద్)తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా-ఎతో తొలి మ్యాచ్‌ను సెలక్షన్ కమిటీ చైర్మన్ వీక్షించారని, రెండో మ్యాచ్‌ను కూడా చూస్తారని చెప్పాడు. జాతీయ జట్టుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టుకు ప్లేయర్ అవసరమైన పక్షంలో ఇండియా ఏ జట్టు నుంచి తీసుకుందామనే ఉద్దేశ్యంతోనే బీసీసీఐ భారత్ ఏ జట్టును ఇంగ్లాండ్‌లో ఆడిస్తుంది.

Story first published: Friday, August 10, 2018, 18:09 [IST]
Other articles published on Aug 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+