Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌గా ఉత్తమ వ్యక్తి: ద్రవిడ్‌కు దిగ్గజాల మద్దతు

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే స్ధానాన్ని భర్తీ చేసేందుకు రాహుల్ ద్రవిడ్ ఉత్తమ వ్యక్తి అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐతో కుంబ్లే ఒప్పందం ఇంగ్లాండ్‌లో జూన్ ఒకటి నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుంది.

దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు కోచ్ పదవికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ గురువారం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పైవిధంగా స్పందించాడు.

రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ స్ఫూర్తిదాయకంగా ఉంటాడని, అతనిలో ఉన్న ఉత్తమ లక్షణం ఏకాగ్రత సాధించే కళను కలిగి ఉండటమని చెప్పాడు.

ద్రవిడ్‌కు మద్దతుగా పాంటింగ్

ద్రవిడ్‌కు మద్దతుగా పాంటింగ్

ద్రవిడ్ అనుభవం నుంచి టీమిండియా ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవచ్చని పాంటింగ్ చెప్పాడు. అయితే బీసీసీఐ స్వదేశ కోచ్‌ కోసం చూస్తుందో లేక విదేశీ కోచ్ కోసం చూస్తుందో తెలియదు. కానీ ద్రవిడ్ కంటే మంచి లక్షణాలున్న కోచ్‌ను మాత్రం చూడలేదని అన్నాడు. కోచ్‌గా ఉండటానికి రాహుల్ ద్రవిడ్ ఇష్టపడితే అతను భారత జట్టుకు ఉత్తమ సేవలు అందించగలడని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అద్భుతాలు

కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అద్భుతాలు

ఇప్పటికే ఇండియా ఏ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ అద్భుతాలు చేసి చూపించాడు. 'ద్రవిడ్‌కు ఎంతో అనుభవం ఉంది. ఐపీఎల్‌లో సేవలందిస్తున్నాడు కాబట్టి మూడు ఫార్మెట్ల గురించి ఇప్పటికే అతడికి ఓ అవగాహన వచ్చి ఉంటుంది. కోచ్‌గా ద్రవిడ్ చక్కగా సరిపోతాడు. అయితే బీసీసీఐ మనసులో ఏముందో, కెప్టెన్ కూడా ఏం కోరుకుంటున్నాడో తెలియాలి. కోహ్లీ గనుక అతడినే కోరుకుంటే బీసీసీఐ తప్పక అతడి మాటను వింటుంది' అని పాంటింగ్ అన్నాడు.

బీసీసీఐ అనూహ్య నిర్ణయం

బీసీసీఐ అనూహ్య నిర్ణయం

మరోవైపు కోచ్‌ కుంబ్లేను కొనసాగించకుండా బీసీసీఐ మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలనుకోవడం అనూహ్య నిర్ణయమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రికెటర్ల జీతాలతో పాటు చాలా అంశాల్లో అనిల్ కుంబ్లే వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న బోర్డు అధికారులు కావాలనే ఇలా చేశారని వార్తలు వస్తున్నాయి. కుంబ్లే కాంట్రాక్టును పొడిగించకుండా, కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించడం వెనుక బలమైన కారణమే ఉందని బీసీసీఐ అధికారులు అంటున్నాయి.

కుంబ్లే కోరికను అంగీకరించిన బీసీసీఐ

కుంబ్లే కోరికను అంగీకరించిన బీసీసీఐ

బీసీసీఐ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, క్రికెటర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు కాంట్రాక్టు మొత్తాలను పెంచాలని ఇటీవలే కుంబ్లే పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కుంబ్లే కోరిక మేరకు బీసీసీఐ కూడా దీనికి అంగీకరించింది. తద్వారా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కింద ‘ఎ', ‘బి', ‘సి' పొందిన ప్రతి ఒక్క క్రికెటర్‌కు పారితోషికం డబుల్ అయింది. అయితే, ఈ డిమాండ్ నెరవేడంతో కుంబ్లే సంతృప్తి చెందలేదు. కెప్టెన్ కోహ్లీకి అదనంగా మరో 25 శాతం ఫీజును సీఓఏకి నివేదికలో ప్రతిపాదించాడు.

కుంబ్లేపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ

కుంబ్లేపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ

ఇప్పటికే ఆటగాళ్ల కాంట్రాక్టు సొమ్మును రెట్టింపు చేసి, అదనపు ఆర్ధిక భారాన్ని బోర్డు నెత్తినపెట్టుకుంది. తన జీతభత్యాలను కూడా పెంచాలని కుంబ్లే డిమాండ్ చేయడం బోర్డు అధికారులకు నచ్చడం లేదు. సెలక్షన్ కమిటీలో సభ్యత్వం ఇవ్వాలన్న అతని మరో డిమాండ్‌ను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణాలతోనే కుంబ్లేను తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+