For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: నిరుద్యోగిని.. ఏమైనా ఆఫర్లు ఉంటే చెప్పండి: ద్రవిడ్

టీ20 వరల్డ్ కప్ భారత్ విజయం సాధించడంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ది ప్రధాన పాత్ర. ప్రత్యర్థిని ఓడించడానికి అతను మైదానంలో మాత్రమే దిగలేదు. కానీ మిగిలిన పనంతా తెరవెనుక నడిపించిందే ద్రవిడే. ప్రణాళికలు రచించడంలో, జట్టుకూర్పు విషయాల్లో ద్రవిడ్ తీసుకున్న నిర్ణయాలు టీమిండియాను జగజ్జేతగా నిలిపేలా చేశాయి.

2007లో భారత జట్టు సారథి వన్డే ప్రపంచకప్ వేట కోసం రాహుల్ ద్రవిడ్ వెస్టిండీస్‌లో అడుగుపెట్టాడు. కానీ ఆ సమయంలో ఘోర పరాభవం ఎదురైంది. జట్టు నిండా దిగ్గజ క్రికెటర్లు ఉన్నా తొలిరౌండ్‌లోనే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 17 ఏళ్ల తర్వాత ద్రవిడ్ మరోసారి ప్రపంచకప్ కోసం కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టాడు. కానీ ఈ సారి కోచ్‌గా వచ్చాడు. పోగొట్టుకున్న చోటే వెతుకున్నట్లుగా 2007లో ఎదురైన చేదు జ్ణాపకాలు చెరిపేసి, భారత జట్టు చరిత్ర సృష్టించేలా చేశాడు.

Rahul Dravid Humorously Requests Job Offers Following T20 World Cup Victory I ll Be Jobless

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ విజయానంతరం ద్రవిడ్ భావోద్వేగానికి గురయ్యాడు. సాధారణంగా ద్రవిడ్ ఎమోషన్స్‌ను నియంత్రించుకుంటాడు. కానీ కోచ్‌గా తన ఆఖరి మిషన్‌ను సక్సెస్ చేయడం, ప్లేయర్‌గా సాధ్యం కానీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా ముద్దాడంతో ఉద్వేగాన్ని భయటపెట్టాడు. కాగా, సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత ద్రవిడ్ మాట్లాడాడు. ఇకపై తాను నిరుద్యోగిని అని, ఏమైనా జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలని సరదాగా అన్నాడు.

2021 నవంబర్‌లో ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. గత వన్డే వరల్డ్ కప్‌తోనే ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. కానీ, ఈ టీ20 ప్రపంచకప్ వరకు కోచ్‌గా ఉండాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ కొనసాగాడు. ''నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. కఠిన పరిస్థితుల్లో గొప్పగా పోరాడిన ఈ జట్టు పట్ల గర్వపడుతున్నా. ఆటగాడిగా నేనెంతో కష్టపడినా ట్రోఫీని అందుకోలేకపోయా. ఇదంతా ఆటలో భాగం. 2007లో పరాభవానికి ఇది ఊరటగా నేను భావించట్లేదు''

''కోచ్‌గా నా పని చేశానంతే. కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేశా. టీమిండియాతో ప్రయాణం అద్భుతంగా సాగింది. ఎన్నో ఏళ్ల శ్రమతో దక్కిన ఈ విజయం జీవితకాల జ్ణాపకం. ఇక వచ్చే వారం నుండి నిరుద్యోగిగా మారిపోతున్నా. ఏమైనా ఆఫర్లు ఉంటే చెప్పండి'' అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

Story first published: Monday, July 1, 2024, 8:19 [IST]
Other articles published on Jul 1, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+