హైదరాబాద్: భారత క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ముద్దుగా ద వాల్, మిస్టర్ డిపెండబుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. బుధవారం ద్రవిడ్ తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా పలువురు తమ సహ ఆటగాడిని, టీమిండియా మాజీ క్రికెటర్‌ని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
నేనెప్పుడూ ద్రవిడ్‌నే అనుసరిస్తాను. ఇది ఒక్క క్రికెట్‌లోనే కాదు. ఎంతో సింపుల్‌గా, డిగ్నిటీగా అతను లైఫ్‌ను లీడ్ చేసే విధానం నాకు నచ్చుతుంది. హ్యాపీ బర్త్ డే ద్రవిడ్: రహానె.
* హ్యాపీ బర్త్ డే లెజండ్ రాహుల్ ద్రవిడ్. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నీ నాయకత్వంలో ఆడటం నా అదృష్టం: ఆర్పీ సింగ్.
* రోజూ కలవకపోయినా మా ఇద్దరి మధ్య స్నేహం పదిలంగానే ఉంటుంది. ఎవరితో అయితే నేను నా మధుర జ్ఞాపకాలను పంచుకున్నానో ఆ వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు: వీవీఎస్ లక్ష్మణ్.
* భారత్‌కు గ్రేట్ వాల్ అయిన రాహుల్ ద్రవిడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నీ బ్యాటింగ్, స్లిప్ క్యాచ్ స్కిల్క్స్ అద్భుతం. నీ కోసం బాలీవుడ్ నుంచి ఓ పాట అంకితమిస్తున్నాను. 'న కోయి హై న కోయి త.. క్రికెట్ మే తుమ్హారే జైసా': హర్భజన్ సింగ్.
* నిబద్ధత, త్యాగానికి మారుపేరైన ద్రవిడ్‌కు హ్యాపీ బర్త్ డే. వన్డే, టెస్టు క్యాప్ నీ చేతుల మీద నుంచి అందుకున్నాను. నా గుండెల్లో నీకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది: సురేశ్ రైనా
* హ్యాపీ బర్త్‌డే రాహుల్. అండర్-19 ప్రపంచకప్‌నకు గుడ్‌లక్: రవిశాస్త్రి
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.