క్రికెట్ అభిమానులకు చేదు వార్త: ఐపీఎల్‌కు ద్రవిడ్ గుడ్‌బై!
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త. టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకోనున్నాడు. ఐపీఎల్‌లో ద్రవిడ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే అటు ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉంటూ ఇటు ఐపీఎల్‌తో ఒప్పందం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికే వస్తుందని సీఓఏకు ఇటీవలే రాజీనామా చేసిన రామచంద్ర గుహ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి సీఓఏకు ద్రవిడ్ లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే.
అందులో బీసీసీఐతో తనకు పది నెలల ఒప్పందం ఉంది కాబట్టి విరుద్ధ ప్రయోజనాల అంశంపై ద్రవిడ్ స్పష్టత కోరాడు. తనను విమర్శించడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై క్లారిటీ ఇవ్వాలని అడిగాడు. అంతేకాదు తాను పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఉల్లంఘనకు పాల్పడలేదని కూడా స్పష్టంచేశాడు.
తన ఒప్పందం మధ్యలో ఉన్నపుడు బోర్డు రూల్స్ మార్చిందేమో తనకు తెలియదని, అలా చేస్తే అది బోర్డు తప్పవుతుంది కానీ తనది కాదని రాహుల్ ద్రవిడ్ అందులో పేర్కొన్నాడు. అయితే తాజాగా బీసీసీఐ ఇండియా ఏ, అండర్-19 జట్ల కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీని కలిసిన ద్రవిడ్
ఇందులో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సీఈఓ రాహుల్ జోహ్రీని రాహుల్ ద్రవిడ్ ఆదివారం సాయంత్రం కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటార్ పదవిని వదులుకోవడాని ద్రవిడ్ అంగీకరించినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 12 నెలల మొత్తం కాలం బీసీసీఐతోనే ఉండాల్సి వస్తుంది.

ఐపీఎల్‌కు దూరం కానున్న ద్రవిడ్
దాంతో ఐపీఎల్ వంటి లీగ్‌లకు ద్రవిడ్ దూరంకాక తప్పదు. గతంలో ద్రవిడ్‌కు బీసీసీఐతో ఏడాదిలో 10 నెలల పాటు ఒప్పందం మాత్రమే ఉండేది. ఈ 10 నెలల కాలానికి గాను ద్రవిడ్‌కు బీసీసీఐ నుంచి రూ.4 కోట్లు అందుకున్నాడు. దీంతో మిగతా రెండు నెలల కాలంలో ఐపీఎల్లో ఒక జట్టుకు ద్రవిడ్ మెంటార్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. ఈ రెండు నెలల కాలంలో ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా వ్వవహరించినందుకు గాను అదే మొత్తంలో ఢిల్లీ ఫ్రాంచైజీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

12 నెలల ఒప్పందం కుదుర్చుకుంటే ఐపీఎల్‌కు దూరమే
ఈ నేపథ్యంలో బీసీసీఐతో 12 నెలల ఒప్పందం కుదుర్చుకున్నట్లైతే ద్రవిడ్ ఐపీఎల్‌కు దూరమైనట్లే. ఇప్పుడు ఢిల్లీ మెంటార్ పదవిని వదులుకోనుండటంతో ద్రవిడ్ కాస్త ఎక్కువ మొత్తాన్నే కోచ్ పదవికి బీసీసీఐ నుంచి డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాము భరించగలిగినంత మొత్తాన్నే ద్రవిడ్‌కు ఇస్తాం
అయితే తాము భరించగలిగినంత మొత్తాన్నే రాహుల్ ద్రవిడ్ డిమాండ్ చేస్తాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అటు ఐపీఎల్ కాంట్రాక్ట్ పోనుండటంతో ఆ మేరకు అతనికి నష్టం కలగకుండా కూడా చూస్తామని బోర్డు స్పష్టం చేయడం విశేషం. ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడానికి ముందు ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications