ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారత కోచ్‌లకు అవకాశాలు ఇవ్వట్లేదు.. చాలా బాధేస్తోంది: ద్రవిడ్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు భారతీయ కోచ్‌లకు తగినన్ని అవకాశాలు ఇవ్వట్లేదు. ఇది చాలా బాధాకరమని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. లీగ్‌లో ఎక్కువ మంది భారత ఆటగాళ్లే ఉంటారు. వారిని అర్థం చేసుకోవడంలో భారత కోచ్‌లే ముందుంటారు. ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారు. ఫ్రాంచైజీలు వారి సేవలను సరైన దిశలో వినియోగించుకోలేకపోతున్నారు. కోచ్‌లుగా కాకున్నా సహాయ కోచ్‌లుగానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ద్రవిడ్ సూచించారు.

అదే నన్ను బాధిస్తోంది
తాజాగా ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ... 'మన దగ్గర మంచి కోచులు ఉన్నారు. వారి సామర్థ్యంపై నాకు నమ్మకముంది. అన్ని విభాగాల్లో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. కానీ.. మనవాళ్లకు ఐపీఎల్‌లో సహాయక కోచ్‌లుగానైనా అవకాశాలు రాకపోవడం నన్ను బాధిస్తోంది. భారతీయ కోచ్‌ల నుంచి జట్లు చాలా ప్రయోజనం పొందొచ్చు' అని అన్నారు.

కోచ్‌ల కోసం ఓ కార్యక్రమం
ఐపీఎల్ టోర్నీ అన్ని జట్లలోనూ దేశవాళీ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు అసిస్టెంట్ కోచ్‌లుగా స్వదేశీయులు ఉంటే.. జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఆటగాళ్లు, భాష, పిచ్‌లు, వాతావరణం గురించి వారికి సరైన అవగాహన ఉంటుంది. కోచ్‌ల కోసమూ జాతీయ క్రికెట్ అకాడమీలో ఓ కార్యక్రమం రూపొందించాలనుకుంటున్నాం. దానివల్ల వారిలో నైపుణ్యాలు, సామర్థ్యం పెరుగుతాయి' అని ద్రవిడ్ పేర్కొన్నారు.

ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయి
భారత కోచ్‌లను తీసుకోకుండా ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయి. కోచ్‌లుగా కాకున్నా సహాయ కోచ్‌లుగానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. టీమిండియా ప్రస్తుత పేసర్లు రాబోయే తరాలపై ప్రభావం చూపిస్తారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారీ అండర్-19 క్రికెట్లో మంచి ఫాస్ట్ బౌలర్లు భారత్‌కు ఉన్నారు. గత ప్రపంచకప్‌లో మనకు కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావి, ఇషాన్ పోరెల్ ఉన్నారు. ఈ సారి కూడా మరికొందరిని చూస్తారు' అని ద్రవిడ్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications