శాండ్‌విచ్ ఖరీదు 1500: తినడానికి డబ్బుల్లేక ద్రవిడ్ టీం ఇబ్బందులు
హైదరాబాద్: టీమిండియా అండర్-19 జట్టు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్, చివరకు కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల డిన్నర్‌కు డబ్బులు లేకుండా పోయాయి. లోధా కమిటీ సంస్కరణల పేరుతో బీసీసీఐపై సుప్రీం కోర్టు విధించిన ఆంక్షలు క్రికెటర్ల పాలిట శాపంగా మారాయి.
ముఖ్యంగా నోట్ల రద్దు ప్రభావం జూనియర్ క్రికెటర్లపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం ముంబై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో సిరిస్ ఆడుతున్న ఇండియా అండర్-19 జట్టు ఆటగాళ్లు రోజువారీ అలవెన్సులు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా జట్టులోకి ఆటగాళ్లంతా డిన్నర్‌కు వారి సొంత డబ్బులే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ డబ్బులు కూడా లేని మరికొంతమంది ఆటగాళ్లు తమ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. లోధా కమిటీ సంస్కరణల అమల్లో నిర్లక్ష్యం వహించనందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీంకోర్టు తొలగించిన సంగతి తెలిసిందే.

రోజువారీ అలవెన్సు కింద రూ.6800
ఈ క్రమలో ఆటగాళ్లకు నిధులు విడుదల చేసేందుకు వీలు లేకుండా పోయింది. జూనియర్ స్థాయి క్రికెటర్లకు రోజువారీ అలవెన్సు కింద బోర్డు రూ.6800 ఇస్తుంది. అయితే కార్యదర్శి సంతకం ఉంటేగానీ బీసీసీఐ నిధులు విడుదల చేయదు. అయితే కార్యదర్శిగా షిర్కేను తప్పించడంతో ఆయన స్థానంలో కొత్తగా మరొకరిని ఎన్నుకోవడానికి బోర్డు సభ్యులు మరో తీర్మానాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది.

సిరీస్ ముగియగానే డబ్బులు అకౌంట్లలో వేస్తాం
అయితే తీర్మానాన్ని పాస్ చేయడం ఆలస్యం అవుతుండటంతో ఆటగాళ్లనే డబ్బు ఖర్చుపెట్టుకోవాల్సిందిగా బోర్డు సూచించింది. అంతేకాదు సిరీస్ ముగియగానే డీఏ డబ్బులు నేరుగా ప్లేయర్స్ అకౌంట్లలో వేస్తాం. బోర్డులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సంతకం చేసేవాళ్లు లేకపోవడంతో ఎవరికీ చెల్లించలేకపోతున్నాం అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

సమస్య అంతా డిన్నర్‌తోనే
ఇదిలా ఉంటే మ్యాచ్ జరిగే రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో కాంప్లిమెంటరీగా ఇస్తారు. మధ్యాహ్నం ఆతిథ్య అసోసియేషన్ భోజనం చూసుకుంటుంది. ఇక సమస్య అంతా డిన్నర్‌తోనే. ముంబైలోని అత్యంత ఖరీదైన హోటల్‌లో మమ్మల్ని ఉంచారని, ఇక్కడ శాండ్‌విచ్ ఖరీదు 1500 ఉందని అండర్ 19 జట్టు ఆటగాడు చెప్పాడు.

కోహ్లీసేనకు ఇబ్బంది లేదు
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లేయర్స్ బయటకు వెళ్లి తినాల్సి వస్తోందని ఆటగాళ్ల తమ బాధను వెళ్లగక్కారు. మరోవైపు హైదరాబద్‌లో ఉన్న కోహ్లీసేనకు మాత్రం డిన్నర్ సమస్య ఎదురు కావడం లేదు. ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన సీవోఏ కమిటీ వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని బోర్డు సీఈవో రాహుల్ జోహ్రిని ఆదేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications