For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Conflict Of Interest: ద్రవిడ్‌కు లైన్ క్లియర్.. విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదు కొట్టివేత!!

Rahul Dravid Cleared Of Conflict Of Interest Charges By BCCI Ethics Officer || Oneindia Telugu
Rahul Dravid cleared of conflict of interest charges by BCCI Ethics Officer

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్‌సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్‌కు భారీ ఊరట లభించింది. ద్రవిడ్‌పై నమోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ గురువారం కొట్టేశారు. ద్రవిడ్ ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు పొందలేదని, ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని జైన్ స్పష్టం చేశారు. దీంతో ద్రవిడ్‌కు లైన్ క్లియర్ అయింది.

సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు:

సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు:

ద్రవిడ్‌ ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యంలోని ఇండియా సిమెంట్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. దీంతో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాడని మధ్యప్రదేశ్ క్రికెట్‌ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేసాడు.

ఎథిక్స్ అధికారికి వాదనలు:

ఎథిక్స్ అధికారికి వాదనలు:

విరుద్ధ ప్రయోజనాల విచారణలో భాగంగా బీసీసీఐ ఎథిక్స్ అధికారి ఎదుట ఈ ఏడాది సెప్టెంబర్ 24న వ్యక్తిగతంగా ద్రవిడ్ హాజరయ్యాడు. ప్రస్తుతం తాను ఇండియా సిమెంట్స్ విధుల్లో లేనని, అలాంటప్పుడు చెన్నై జట్టుతో సంబంధం ఎలా ఉంటుందని వివరణ ఇచ్చాడు. మరోసారి (ఈ నెల 12న) కూడా ద్రవిడ్ ఎథిక్స్ అధికారి ఎదుట హాజరయి తన వాదన వినిపించాడు.

ద్రవిడ్‌కు లైన్ క్లియర్:

ద్రవిడ్‌కు లైన్ క్లియర్:

వాదనలు విన్న అధికారి ద్రవిడ్‌ విరుద్ధ ప్రయోజనాలు పొందలేదని, ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ద్రవిడ్‌ ఇండియా సిమెంట్స్‌ నుండి సెలవు తీసుకున్నట్లు కూడా తెలిపాడు.

వినోద్‌ రాయ్‌ నోట్‌:

వినోద్‌ రాయ్‌ నోట్‌:

మొదటిసారి ద్రవిడ్‌ ఎథిక్స్‌ అధికారి హాజరయ్యే ముందు ఎథిక్స్ అధికారికి అప్పటి సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఓ నోట్‌ పంపారు. ఇండియా సిమెంట్స్‌లో ద్రవిడ్‌ వేతనం లేకుండా సెలవు తీసుకుంటే.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన పరిధిలోకి రాడని పేర్కొన్నాడు. చికాగో విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్‌ రాజన్‌, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేసిన అరవింద్‌ పనగడియా గురించి రాయ్‌ లేఖలో వివరించారు.

Story first published: Friday, November 15, 2019, 7:50 [IST]
Other articles published on Nov 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+