For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రవిడ్ 'ద వాల్' మనసులోని మాటలు

Rahul Dravid Picks Sachin Tendulkar To Bat For His Life
Rahul Dravid chooses former teammate Sachin Tendulkar to ‘bat for his life’

హైదరాబాద్: క్రికెటర్‌గా, కెప్టెన్‌గా, అండర్ 19 జట్టు కోచ్‌గా ఎన్నో విజయాలనందుకున్న సంచలనం 'ద్రవిడ్'. ఆటగాడిగా ఉన్నప్పుడే కాదు రిటైర్‌మెంట్ అయ్యాక కూడా క్రికెట్‌యే తన జీవితమని స్థిరపడిపోయాడు. ఎక్కువ మాట్లాడినట్లు అనిపించదు. అతని రికార్డులే మాట్లాడతాయి. మార్గదర్శకంగా మారి ఎందరినో ముందుకు నడిపిస్తూ.. మరెందరినో అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమయ్యేలా తుది మెరుగులు దిద్దుతున్న 'ద వాల్' రాహుల్ ద్రవిడ్.

ఇటీవల అండర్ 19 జట్టుకు కాస్తంత విరామం ఇచ్చి.. ఇండియా ఏ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ బిజీ పనుల్లోనే ఓ ఇంగ్లీషు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నాడు ద్రవిడ్.

* క్రికెటర్‌ కాకపోయి ఉంటే..?
కామర్స్‌ లేదా అకౌంట్స్‌కు సంబంధించి ఏదైనా పని చేస్తుండేవాడిని.

* మరో క్రికెటర్‌ ఆట నుంచి మీరు తీసుకోవాలని ఆశించే లక్షణం?
బ్రయాన్‌ లారా నైపుణ్యమే. అతడి సృజనాత్మకత, నైపుణ్యం నాకెంతో ఇష్టం.

* మీరు ఎదుర్కోవాలని ఆశించే పాత తరం బౌలర్‌?
మైకేల్‌ హోల్డింగ్‌ లేదా జెఫ్‌ థాంప్సన్‌. కానీ కొన్ని బంతులే ఆడాలనుకుంటా. అది కూడా హెల్మెట్‌తో.

* క్రికెటేతర ఆటలో మీరు గెలవాలని ఆశించే ట్రోఫీ?
ఒలింపిక్‌ స్వర్ణం. ఎవరైనా ఒలింపిక్‌ స్వర్ణం గెలుస్తుంటే చూడటమే గొప్పగా ఉంటుంది. అలాంటిది మనమే గెలిస్తే అది అపురూపమే.

Rahul Dravid chooses former teammate Sachin Tendulkar to ‘bat for his life’

* అడిలైడ్‌లో 233.. కోల్‌కతాలో 180.. జమైకాలో 81.. వీటిలో ఏది మీ ఫేవరెట్‌?
ఇందులో ఏదో ఒకటి ఎంచుకోమంటే కష్టం. ప్రతి ఇన్నింగ్స్‌ చాలా ప్రాధాన్యమున్నదే. కొన్ని రకాలుగా చూస్తే జమైకాలో చేసిన 81 పరుగులకే ఎక్కువ గుర్తింపు రాలేదు. నేను దాన్నే ఎంచుకుంటా.

* మీరు సొంతగా నిక్ నేమ్ పెట్టుకోవలసి వస్తే..?
రాహుల్ అని పిలవమంటా. అది చాలు

* పాత తరం క్రికెటర్లలో ఎవరితో భాగస్వామ్యం నెలకొల్పాలని ఆశిస్తారు?
సునీల్‌ గావస్కర్‌తో ఒకసారి కలిసి ఆడితే బాగుంటుందని నా కోరిక. సన్నీతో భాగస్వామ్యం తర్వాత ఆయన ఔటైపోతే గుండప్ప విశ్వనాథ్‌ క్రీజులోకి వస్తే బాగుంటుంది. నేను ఎదిగేటపుడు నా చిన్ననాటి హీరోలు వాళ్లు.

* మీ ఆత్మకథ రాస్తే.. దానికేం పేరు పెడతారు?
ఎప్పుడూ రాయని ఒక పుస్తకం. (నవ్వుతూ)

* మీ జీవిత మార్గదర్శి ఎవరు?
నాలో చాలా ఆలోచనలు, విలువలు పాదుగొల్పింది మా తల్లిదండ్రులు. నేను చేసే పనులు, నమ్మే విషయాలు చాలా వరకు వారి నుంచే వచ్చాయి.

* ఆడేటపుడు మీలో మూఢనమ్మకాలుండేవా?
నిజానికి నేను మూఢనమ్మకాలున్న వ్యక్తిని కాదు. కానీ ఎప్పుడూ కుడి కాలికే తొలి ప్యాడ్‌ కట్టేవాడిని. అది అలవాటుగా మారింది. కొన్నిసార్లు ముందు ఎడమ కాలి ప్యాడ్‌ తీసుకుని కూడా తర్వాత కుడి కాలికే ముందు కట్టేవాడిని. అది మూఢనమ్మకం మాత్రం కాదు.

Rahul Dravid chooses former teammate Sachin Tendulkar to ‘bat for his life’

* మీరు చదివిన అత్యుత్తమ పుస్తకం?
అత్యుత్తమ పుస్తకం అని కాదు కానీ.. ఒక యువకుడిగా నాపై అత్యంత ప్రభావం చూపిన పుస్తకం గురించి చెబుతా. రిచర్డ్‌ బాక్‌ రాసిన జొనాథన్‌ లివింగ్‌స్టన్‌ సీగల్‌ పుస్తకాన్ని 15-16 ఏళ్ల వయసులో చదివాను. బాగా నచ్చింది. వివిధ దశల్లో అందులోని విషయాల్ని అమలుచేయడానికి ప్రయత్నించా. సరిగ్గా నేను క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకుందానుకున్న దశలో ఆ పుస్తకం చదివాను.

* ఇకపై జీవితమంతా ఒకే ఆహారం తినాల్సి వస్తే దేన్ని ఎంచుకుంటారు?
నాకు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. కాబట్టి చాక్లెట్లను ఎంచుకుంటా. కానీ అది నా శరీరాన్ని అది దెబ్బ తీయనంత వరకు మాత్రమే. ఇకపై జీవితాంతం ఒకటే ఒక్కటే అంటే మాత్రం ఆరోగ్యాన్ని దెబ్బ తీయనిదేదో చూసుకుని ఎంచుకుంటా.

* సహచర ఆటగాడెవరినైనా భయపెట్టాలనుకుంటే.. ఎవరిని ఎంచుకుంటారు? ఏం చేస్తారు?
వెంకటేష్‌ ప్రసాద్‌తో చాలా తక్కువసార్లు గదిని పంచుకున్నా. అతను చాలా శుభ్రంగా ఉండేవాడు. ప్రసాద్‌ దగ్గరికెళ్లి గదినంతా అపరిశుభ్రంగా మార్చి తన ముఖం చూడటం వెలకట్టలేని అనుభూతినిస్తుంది.

* మీ గురించి పత్రికలో వచ్చిన శీర్షికల్లో మరపు రానిది?
ద్రవిడ్‌ హెల్ప్స్‌ సెయింట్‌ జోసెఫ్స్‌ విన్‌ టైటిల్‌.. ఇదీ ఆ శీర్షిక. ఒక ఆటగాడి కెరీర్‌ ఆరంభంలో తొలిసారిగా పత్రికలో పేరు వస్తే అది గుర్తుండిపోతుంది. నేను కూడా అప్పట్లో చాలా ఉద్వేగానికి గురయ్యా. నా పేరును వాళ్లు సరిగ్గానే రాశారనుకుంటా. కెరీర్‌ తొలి రోజుల్లో చాలామంది 'డేవిడ్‌' అని రాసేవాళ్లు.

* ఇప్పుడు ఆటలో కొనసాగుతూ ఉంటే.. ప్రస్తుత బౌలర్లలో ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేవారనిపిస్తోంది?
నాకు మరీ అంత వయసైపోలేదు. ఈ తరం బౌలర్లలో కొంతమందిని ఎదుర్కొన్నాను. ఇబ్బంది పడ్డాను. స్టార్క్‌ నన్ను ఎక్కువ ఇబ్బంది పెడతాడనుకుంటా. కాగిసో రబాడ కూడా. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ను ఎదుర్కోవడం సవాలే. కొత్త బంతితో అతడిని ఆడటం కష్టం. అతను రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేయడం ద్వారా సవాలు విసురుతాడు.

* రిటైర్మెంట్‌ తర్వాత అత్యంత ఇష్టంగా చేస్తున్న పని?
చేస్తున్నది కాకుండా.. చేయని పని ఒకటుంది. ఫాస్ట్‌బౌలర్లను, వారి బౌన్సర్లు ఎదుర్కోకపోవడం. అదే నాకెంతో ఇష్టం. 145 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చే బంతుల్ని ఎలా ఎదుర్కోవాలా అనే భయంతో నిద్ర లేవాల్సిన అవసరం ఇప్పుడు లేదు.

* మీకు అతీంద్రయ శక్తులుంటే ఏం కావాలనుకుంటారు?
నేను కొంచెం పాత తరం వ్యక్తిని. సూపర్‌ మ్యాన్‌ నా హీరో. అతడిలా ఎక్కడికైనా ఎగిరిపోవాలని.. ఏదైనా చేసేయాలని అనుకుంటా.

* క్రికెటేతర ఆటల్లో మీరు ఆరాధించే, కలవాలనుకునే వ్యక్తి?
రోజర్‌ ఫెదరర్‌.. అతడి ఆట చూశా. ఆరాధించా. తనను తాను మలుచుకున్న తీరు, సాధించిన ఘనతలు అపూర్వం. ఒకసారి వింబుల్డన్‌లో నేరుగా రోజర్‌ ఆట చూశా. ఒక అభిమానిలా మారి ఫొటో కూడా తీసుకున్నా. ఆ అనుభవాన్ని ఎంతో ఆస్వాదించా.


* క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు బాగా ఇష్టపడే స్టేడియం?

లార్డ్స్‌. అక్కడ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. అందులో ఏదో ప్రత్యేకత ఉంది. అది చరిత్ర వల్ల కావచ్చు. వాతావరణం వల్ల కావచ్చు.

* జీవితాంతం కలిసి ఆడాలనుకునే క్రికెటర్‌ ఎవరు?
నేను కలిసి ఆడిన వాళ్లలో సచిన్‌ టెండూల్కరే అత్యుత్తమం. నాణ్యత, సొగసు.. ఈ రెంటిలోనూ అతడికి తిరుగులేదు. తన అత్యుత్తమ దశలోని సచిన్‌తో కలిసి ఆడాలనుకుంటా.


* మీరు మైదానంలో ఎదుర్కొన్న తమాషా స్లెడ్జింగ్‌?

కోల్‌కతాలో ఓ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో ఆడాను. రెండో ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో ఆడాల్సి వచ్చింది. అప్పుడు బ్యాటింగ్‌కు వెళ్తుంటే తర్వాతి మ్యాచ్‌లో 12వ స్థానానికి పడిపోతావని ప్రత్యర్థి ఆటగాడన్నాడు. అది తమాషాగా అనిపించింది. అందుకు ఆస్కారం ఉంది కూడా.

* మీపై సినిమా తీస్తే ఆ పాత్రను ఎవరు చేయాలి?
'అమీర్‌ ఖాన్‌' అయితే బాగుంటుందేమో..

Story first published: Wednesday, July 25, 2018, 12:46 [IST]
Other articles published on Jul 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+