Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టు యజమానిగా రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్‌గా భారత స్టార్ స్పిన్నర్!

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే క్రీడా ప్రపంచంలో భారీ అంచనాలను పెంచుతోంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ లీగ్‌లోకి అడుగుపెట్టడం విశేషం. డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీని రాహుల్ ద్రవిడ్ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. యూరప్ లో క్రికెట్‌ను అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడానికి, యువ ప్రతిభను అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడానికి ఈ లీగ్ ఓ అద్భుతమైన మార్గమని తన ధీమాను వ్యక్తం చేశాడు.

కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్
డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాహుల్ ద్రవిడ్ యజమానిగా, అశ్విన్ కెప్టెన్‌గా ఉండటంతో ఈ జట్టుపై అభిమానుల్లో అప్పుడే ఆసక్తి నెలకొంది. డబ్లిన్‌లో ఇప్పటికే క్రికెట్ పట్ల మక్కువ ఉన్న ప్రజలు ఉన్నారని, అశ్విన్ వంటి కెప్టెన్ సారథ్యంలో యువ ప్లేయర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఓ గొప్ప వేదిక అవుతుందని రాహుల్ ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Rahul Dravid Buys Dublin Guardians in ETPL R Ashwin Named Captain of the European T20 League

దిగ్గజాల కలయికతో 6 జట్లు
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ మొత్తం 6 ఫ్రాంచైజీలతో సాగనుంది. కేవలం రాహుల్ ద్రవిడ్ మాత్రమే కాకుండా గ్లెన్ మాక్స్‌వెల్, క్రిస్ గేల్, స్టీవ్ వా, జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు వివిధ జట్ల యాజమాన్యాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ లీగ్‌లో బెల్ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, రోటర్‌డ్యామ్, ఆమ్‌స్టర్‌ డ్యామ్, డబ్లిన్ నగరాలకు ప్రాతినిధ్యం వహించే జట్లు తలపడనున్నాయి. క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ లీగ్ రూపుదిద్దుకుంది.

సందడి చేయనున్న అంతర్జాతీయ స్టార్లు
ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో ప్రపంచస్థాయి క్రికెటర్లు సందడి చేయనున్నారు. మిచెల్ మార్ష్, లియామ్ లివింగ్‌స్టోన్, గ్లెన్ మాక్స్‌వెల్, హెన్రిచ్ క్లాసెన్, మిచెల్ శాంట్నర్ వంటి స్టార్లు వివిధ జట్ల తరఫున మైదానంలోకి దిగనున్నారు. ఈ ఫ్రాంచైజీ మోడల్ కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, యూరప్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించబడింది.

ద్రవిడ్ రాకతో కొత్త ఊపు
రాహుల్ ద్రవిడ్ వంటి నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఈ లీగ్‌లో భాగస్వామి కావడంతో యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ స్థాయి ఒక్కసారిగా పెరిగిందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడంలో ద్రవిడ్‌కు ఉన్న అనుభవం, లీగ్ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే ఈ క్రికెట్ పండుగ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Tuesday, May 12, 2026, 8:39 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+