For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విడాకులు తీసుకున్న మరో భారత క్రికెటర్!

భారత యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ వార్తను పంచుకున్నాడు. గత కొంతకాలంగా తన భార్య ఈశానీ జోహార్‌తో విడిపోతున్నారనే ప్రచారానికి తెరదించుతూ.. తాము అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ చాహర్ స్పష్టం చేశాడు.

సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
తన విడాకులపై 26 ఏళ్ల రాహుల్ చాహర్ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. "నేను చాలా తక్కువ వయసులోనే వివాహం చేసుకున్నాను. ఆ సమయంలో నా విలువలు, నా జీవిత గమ్యం గురించి నాకు పూర్తి అవగాహన లేదు" అని ఆయన పేర్కొన్నారు. గత 15 నెలలుగా కోర్టుల చుట్టూ తిరగడం తనకు ఎంతో సహనాన్ని, ఓర్పును నేర్పిందని రాహుల్ వెల్లడించాడు.

Rahul Chahar Announces Divorce from Ishani Johar Shares Emotional Post about the 15-month legal battle

నేర్చుకున్న పాఠమే తప్ప పశ్చాత్తాపం లేదు..
ఈ బంధం ముగియడంపై రాహుల్ సానుకూలంగా స్పందించాడు. "నేను ఈ అధ్యాయాన్ని కోపంతోనో లేదా పశ్చాత్తాపంతోనో ముగించడం లేదు. కొన్ని బంధాలు జీవితాంతం ఉండవు, కానీ అవి మనల్ని మేల్కొల్పడానికి, మనకు పాఠాలు నేర్పడానికి వస్తాయి. ఇప్పుడు నేను మునుపటి కంటే మరింత స్పష్టతతో, అవగాహనతో ఉన్నాను" అని రాహుల్ రాసుకొచ్చాడు. దీన్ని ఓ ముగింపుగా కాకుండా, కొత్త ప్రారంభంగా చూస్తున్నట్లు ఆయన తెలిపాడు.

నాలుగేళ్లకే విడిపోయిన జంట
రాహుల్ చాహర్, ఈశానీ జోహార్ చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. ఈశానీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. వీరిద్దరికీ 2019లో జైపూర్‌లో నిశ్చితార్థం జరగ్గా.. 2022లో గోవాలో పూర్తి అంగీకారంతో వివాహం చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో (మార్చి 9) వీరి నాలుగో వివాహ వార్షికోత్సవం జరగాల్సి ఉండగా, అంతలోనే ఈ జంట చట్టబద్ధంగా విడిపోయారు.

క్రికెట్ కెరీర్ పైన ఫోకస్
విడాకుల ప్రక్రియ ముగియడంతో రాహుల్ చాహర్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పాడు. ఆత్మగౌరవం, ప్రశాంతత, మెరుగైన నిర్ణయాలతో ముందుకు సాగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. రాహుల్ చాహర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ప్రాజెక్టులతో బిజీగా ఉండనున్నాడు.

Story first published: Friday, February 20, 2026, 20:14 [IST]
Other articles published on Feb 20, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+