
హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ రెహ్మత్ షా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో బంగ్లాదేశ్ తరుపున తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రెహ్మత్ షా ఛరిత్ర సృష్టించాడు. గురువారం బంగ్లాదేశ్‌తో ఆరంభమైన ఏకైక టెస్టులో రెహ్మాత్ షా 187 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 102 పరుగులు చేశాడు.
ఫలితంగా ఆప్ఘనిస్థాన్ తరుపున టెస్టుల్లో సెంచరీ సాధించిన మొదటి ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో వచ్చిన రెహ్మాత్ షా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడో వికెట్‌కు 29 పరుగులు జోడించిన షా.. నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు.
టీ విరామం అనంతరం రెహ్మాత్ షా సెంచరీ సాధించాడు. ఇదిలా ఉంటే, రెహ్మాత్ షా ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులోనే సెంచరీ సాధించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలో డెహ్రడూన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద రహ్మత్ షా ఔట్ కావడంతో తృటిలో సెంచరీ కోల్పోయాడు.
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టెస్టుల్లో తమ దేశాల తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే....
చార్లెస్ బ్యానర్‌మేన్ (ఆస్ట్రేలియా)
అమినుల్ ఇస్లామ్ (బంగ్లాదేశ్)
డబ్యూ జీ గ్రేస్ (ఇంగ్లండ్)
లాలా అమర్‌నాథ్ (భారత్)
కెవిన్ ఒబ్రియన్ (ఐర్లాండ్)
డెమ్‌ష్టర్ (న్యూజిలాండ్)
నాజర్ మహ్మద్ (పాకిస్తాన్)
జిమ్మీ సింక్లైర్ (దక్షిణాఫ్రికా)
సిదాత్ వెట్టిమ్యూనీ (శ్రీలంక)
క్లైఫర్డ్ రోచ్ (వెస్టిండీస్)
డేవ్ హాటన్ (జింబాబ్వే)
రహ్మత్ షా (అఫ్గానిస్తాన్)