For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీపై రాజస్ధాన్ విజయం: రాణించిన రహానే, నెం. 1 స్ధానానికి..

By Nageswara Rao

ముంబై: ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో నిలకడగా రాణిస్తోన్న రాజస్ధాన్ రాయల్స్ జట్టు మరో విజయం సాధించింది. అజ్యంకె రహానె 91 పరుగులతో నాటౌట్, కరుణ్‌ నాయర్‌ 61 పరుగులు అర్ధ సెంచరీలతో రాణించడంతో.. రాజస్థాన్‌ 14 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. రాజస్ధాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన రహానెకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

ఆదివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులే చేసింది. ఢిల్లీ జట్టులో జేపీ డుమినీ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు. బిన్నీ, కులకర్ణి, ఫాల్క్‌నర్‌ తలో 2 వికెట్లు తీశారు.

Rahane's unbeaten 91 helps Rajasthan beat Delhi by 14 runs; jump to top spot


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ 11, శ్రేయాస్‌ అయ్యర్‌ 9 పరుగులకే అవుటయ్యారు. మ్యాచ్ ప్రారంభంలో మూడు ఫోర్లు కొట్టి ఊపుమీద కన్పించిన యువరాజ్ సింగ్ 22 పరుగులకే ఔటై పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ వికెట్లు పడుతున్నా కెప్టెన్‌ డుమినీ పట్టుదలతో బ్యాటింగ్‌ చేశాడు.

నాల్గవ వికెట్‌కు మాథ్యూస్‌తో జత కలిసి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 34 బంతుల్లో డుమినీ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇక చివర్లో ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో డుమినీని ఫాల్క్‌నర్‌ అవుట్‌ చేశాడు. చివరి ఓవర్‌లో 30 పరుగులు చేయాల్సి ఉండగా.. ఢిల్లీ 15 పరుగులే చేసింది.

ఇక తొలుత ఢిల్లీ జట్టు టాస్ గెలిచి రాజస్ధాన్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. 15 ఓవర్లలో రాజస్థాన్‌ స్కోరు 114/1 మాత్రమే. అయితే చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్‌ మరో 75 పరుగులు చేయగలిగింది. రహానె, కరుణ్‌ నాయర్‌ రెండో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+