న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ లయన్స్‌తో తలపడతే భారత్-ఎ జట్టిదే: కెప్టెన్‌గా రహానే

 Rahane, Pant named in India A squad against England Lions

హైదరాబాద్: ఇంగ్లాండ్ లయన్స్‌తో తలపడతే భారత్-ఎ జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించారు. జనవరి 23 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా తొలి మూడు వన్డేలకు, ఆ తర్వాత నాలుగు, ఐదు వన్డేలకు వేరువేరుగా జట్లను ప్రకటించారు. ఈ జట్టుకు భారత టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు.

జనవరి 29, 31న జరిగే చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి జరిగే టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నాడు. హైదరాబాదీ హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, కృనాల్ పాండ్యాలు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

చివరి రెండు మ్యాచ్‌లకు మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ అంకిత్ బావ్నే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 7 నుంచి వాయనాడ్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల మ్యాచ్ కూడా జరుగనున్నాయి.

తొలి మూడు వన్డేలకు జట్టు:
రహానే (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్, రితురాజ్, శ్రేయాస్, విహారి, అంకిత్ బావ్నే, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్యా, అక్షర్ పటేల్, మయాంక్ మర్కండే, జయంత్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీ.

చివరి రెండు వన్డేలకు జట్టు:
అంకిత్ బావ్నే (కెప్టెన్), రితురాజ్, అన్మోల్‌ ప్రీత్, రికీ భుయ్, సిద్ధేశ్ లాడ్, హిమ్మత్ సింగ్, పంత్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్, శార్దూల్.

Story first published: Sunday, January 20, 2019, 13:55 [IST]
Other articles published on Jan 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X