Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ క్షణం భయమేసింది: బాల్ గర్ల్‌ను ఓదార్చి చెంపపై ముద్దు పెట్టిన నాదల్ (వీడియో)

Rafael Nadal meets Australian Open ballgirls family in another sweet gesture

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020లో శుక్రవారం ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తన రెండవ రౌండ్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ తన ప్రత్యర్థి వైపు కొట్టిన బంతి అనుకోకుండా అంపైర్‌కు సమీపంలో నిలబడి ఉన్న బాల్ గర్ల్‌కు తగిలింది.

ఈ ఘటనతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆ బాల్ గర్ల్‌కి ఏమైందోనని భయంతో గట్టిగా అరిచారు. దీంతో బాల్ గర్ల్‌కు ఏమైనా దెబ్బ తగిలిందేమోనని రఫెల్‌ అటువైపు చూడగా ఆమె బాగానే ఉన్నానంటూ సైగ చేసింది. అయితే, ఆ చిన్నారి సమాధానానికి రఫెల్ నాదల్ సంతృప్తి చెందలేదు.

అంతేకాదు మ్యాచ్ మధ్యలో ఆ చిన్నారిని సమీపించి బంతి తగిలిన చోట ఏమైనా నొప్పి ఉందా అని ఆరా తీసి.... అనంతరం ఆ బాలిక టోపీ పక్కకు జరిపి ఆమె చెంపపై ఆప్యాయంగా ముద్దు పెట్టి తలనిమిరి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

టెన్నిస్ కోర్టులో తన ఓ భయంకరమైన క్షణం అనుభవించిన తరువాత, నాదల్ ఆ చిన్నారిని కలిసేందుకు ఆమె ఇంటికి కూడా వెళ్లాడు. ఆ చిన్నారి పేరు అన్నిత. ఈ విషయాన్ని రఫెల్ నాదలే తన ట్విట్టర్‌లో స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు.

"ఆమె గురించి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే ఆ బంతి నేరుగా ఆమె తలకు తగిలింది కానీ గాయం అవలేదు. ఈ రోజు చిన్నారితో పాటు ఆమె కుటుంబాన్ని కలిసే అవకాశం వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. అన్నిత ధైర్యవంతురాలైన అమ్మాయి!" అని చిన్నారితో కలిసి దిగిన ఫోటోను నాదల్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

"నిజాయితీగా చెప్పాలంటే టెన్నిస్ కోర్టులో నా భయానక క్షణాలలో ఇదొకటి, చాలా సంవత్సరాల క్రితం వింబుల్డన్ నుండి నాకు భయానక జ్ఞాపకం ఉంది" అని రఫెల్ నాదల్ చెప్పుకొచ్చాడు. కాగా, రెండవ రౌండ్‌లో రఫెల్ నాదల్ 6-3, 7-6 (4), 6-1 తేడాతో డెల్బోనిస్‌ను వరుస సెట్లలో ఓడించి మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు. మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియా టెన్నిస్ ఆటగాడు పాబ్లో కారెనో బస్టాతో నాదల్ తలపడనున్నాడు.

Story first published: Friday, January 24, 2020, 15:22 [IST]
Other articles published on Jan 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+