Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో: లార్డ్స్ నిండా వాళ్లే.. పోటెత్తిన వ‌యోధిక వృద్ధులు!

racing for the best vantage points in the pavilion as the gates fly open for the CWC19 final

లండ‌న్‌: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ మెగా ఈవెంట్‌లో చిట్ట‌చివ‌రి మ్యాచ్‌. ఈ మ్యాచ్ గెలిస్తే ప్ర‌పంచ‌క‌ప్ జ‌గ‌జ్జేత ఎవ‌రో తేలిపోతుంది. 27 సంవ‌త్స‌రాల త‌రువాత తొలిసారిగా ఫైన‌ల్‌లో అడుగు పెట్టింది ఇంగ్లండ్ జ‌ట్టు. పైగా- ఆడుతున్న‌ది సొంత గ‌డ్డపైన. అందులోనూ- ప్ర‌తిష్ఠాత్మ‌కం, చారిత్రాత్మ‌క‌మైన లార్డ్స్ మైదానంలో. ఇవి చాలు యునైటెడ్ కింగ్‌డ‌మ్‌ను ఫీవ‌ర్‌లో ముంచెత్త‌టానికి. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో అవే దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. క్రికెట్ ఫీవ‌ర్ యుకేను ఆవహించింది. ప్ర‌త్యేకించి- యువ‌త కంటే ఎక్కువ‌గా ఈ మ్యాచ్‌ను తిల‌కించ‌డానికి వ‌యోధిక వృద్ధులు పోటీ ప‌డ‌టం క‌నిపించింది. వారిలో చాలామంది మెరైల్‌బోన్ క్రికెట్ క్ల‌బ్ (ఎంసీసీ) ప్ర‌తినిధులు ఉన్నారు.

గేట్ వ‌ద్ద ప‌డిగాపులు..

ఇంగ్లీష్ టీమ్ అభిమానులు ఉద‌యం నుంచే గేట్ల వ‌ద్ద ప‌డిగాపులు కాశారు. టికెట్లు చేత ప‌ట్టుకుని బారులు తీరారు. ఓ చేత్తో టికెట్‌, మ‌రో చేత్తో గొడుగు. వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్నందున‌- ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా గొడుగుల‌ను త‌మ వెంట తెచ్చుకున్నారు బ్రిటీష‌ర్లు. మ్యాచ్ ఆరంభానికి అర‌గంట ముందు లార్డ్స్ భ‌ద్ర‌తా సిబ్బంది గేట్ల‌ను తెర‌వ‌గానే పోలోమంటూ పోటెత్తారు. ఒక‌రినొక‌రు తోసుకుంటూ మ‌రీ స్టాండ్స్ వైపు ప‌రుగులు తీశారు. నెత్తిన‌ కౌబాయ్ టైపు హ్యాట్‌, లాంగ్‌కోట్ ధ‌రించిన వ‌యోధిక వృద్ధులు ఒక‌రినొక‌రు పోటీప‌డుతూ స్టాండ్స్ వైపు పోటెత్త‌డం.. వారిలోని ఆస‌క్తికి అద్దం ప‌ట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

1
43691

{headtohead_cricket_2_4}

Story first published: Sunday, July 14, 2019, 17:08 [IST]
Other articles published on Jul 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+