Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rachin Ravindra: నాడు బెంగళూరులో ప్రేక్షకుడిగా.. నేడు అదే బెంగళూరులో ఆపద్బాంధవుడిగా

బెంగళూరు: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు జట్లకూ ఇది కీలకమైనదే.. న్యూజిలాండ్‌కు మరింత. గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. టోర్నమెంట్ ఆరంభంలో వరుస విజయాలను సాధిస్తూ ఆ తరువాత చతికిలపడ్డ బ్లాక్ క్యాప్స్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే ఇదొక్కటీ గెలిస్తే చాలు.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. న్యూజిలాండ్ శుభారంభం చేసింది. 36 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో ఆరు ఫోర్లతో 35 పరుగులు చేశాడు కాన్వే. కేప్టెన్ కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర దుమ్ము దులిపారు ఈ మ్యాచ్‌లో.

Rachin Ravindra becomes the first debutant New Zealand player to score 3 centuries intheWorldCup

రచిన్ రవీంద్ర మరోసారి సెంచరీ ఊది పడేశాడు. 94 బంతుల్లో 108 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్‌లో ఒక భారీ సిక్సర్, 15 మెరుపు బౌండరీలు ఉన్నాయి. మహ్మద్ వసీం బౌలింగ్‌లో సవూద్ షకీల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రచిన్. షకిల్ సంధించిన డెలివరీని భారీ షాట్ ఆడాడు గానీ పవర్ చాలలేదు. గాల్లోకి లేచిన బంతిని మిడ్ వికెట్ వద్ద సవూద్ షకీల్ అందుకున్నాడు.

గాయం తరువాత జట్టులో పునరాగమనం చేసిన కేన్ విలియమ్సన్ తన సత్తా చాటాడు. 79 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, 12 బౌండరీలో 95 పరుగులు చేసిన తరువాత ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం డారిల్ మిఛెల్, మార్క్ ఛాప్‌మన్ క్రీజ్‌లో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్నారు.

Rachin Ravindra becomes the first debutant New Zealand player to score 3 centuries intheWorldCup

ఈ మ్యాచ్‌లో సెంచరీతో రచిన్ రవీంద్ర ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్ ప్లేయర్లెవరూ ఒకే ప్రపంచకప్‌లో మూడుసార్లు వంద పరుగుల మార్క్‌ను అందుకున్న దాఖలాలు లేవు. ఈ ఘనత సాధించిన మొదటి డెబ్యుటెంట్ బ్యాటర్ కూడా అతనే.

ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరులో ఇంట్లో కూర్చుని టీవీలో చూశాడు రచిన్. న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ అది. ఇప్పుడు అదే బెంగళూరులో న్యూజిలాండ్‌కు ఆపద్బాంధవుడిలా మారాడు. సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోన్నాడు.

Story first published: Saturday, November 4, 2023, 13:45 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+