For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరిణితి లేదు వ్యాఖ్యలపై నేరుగా రబాడతోనే మాట్లాడతానన్న కోహ్లీ

ICC Cricket World Cup 2019 : 'Will Talk To Kagiso Rabada Man-to-man' Says Virat Kohli
Rabadas Immature jibe: Kohli says he will discuss man to man

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో పరిణితి లేకుండా వ్యవహారిస్తాడని సఫారీ పేసర్ కగిసో రబాడ చేసిన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రబాడ వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం చాలా హుందాగా వ్యవహారించాడు. వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో రబాడ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "రబాడ నేను ఎన్నో సార్లు పోటీ పడ్డాం. ఒకవేళ నా మీద చేసిన వ్యాఖ్యలపై చర్చించాల్సిందేమైనా ఉంటే అది మేమిద్దరం తేల్చుకుంటాం. అతడితోనే నేరుగా మాట్లాడతాను. ఇలా మీడియా సమావేశంలో కాదు" అని చెప్పాడు.

రబాడపై కోహ్లీ ప్రశంసల వర్షం

రబాడపై కోహ్లీ ప్రశంసల వర్షం

రబాడపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. "చూడండి... లుంగి ఎంగిడి లేదా డేల్ స్టెయిన్ ఆడుతున్నాడా? అనేది ముఖ్యం కాదు. కానీ, రబాడ విషయానికి వస్తే అతడొక వరల్డ్ క్లాస్ బౌలర్. అతడి వల్ల ప్రత్యర్ధి జట్టుకు ముప్పు. ఆట పట్ల అతడికి ఉన్న నిబద్ధత వేరు" అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

కోహ్లీ ఇంకా ఎదగలేదు

కోహ్లీ ఇంకా ఎదగలేదు

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ‌జరగడానికి ముందు కోహ్లీ ఇంకా ఎదగలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రబాడ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

రబాడ మాట్లాడుతూ

రబాడ మాట్లాడుతూ

ఈ గొడవ గురించి రబాడ మాట్లాడుతూ "ఆర్సీబీతో మ్యాచ్‌లో నేను వేసిన బంతికి కోహ్లీ ఫోర్ బాదాడు. ఆ తర్వాత నేను తర్వాతి బంతి గురించి ఆలోచిస్తుండగా కోహ్లీ నన్ను ఓ మాట తిట్టాడు. నాకు కోపం వచ్చి, అదే మాటను తిరిగి అన్నాను. కోహ్లీకి కోపం వచ్చింది. కోహ్లీ మంచి బ్యాట్స్‌మెన్ కావచ్చు, కానీ మానసికంగా ఎదగలేదు. ఎదుటివాళ్లు తిరిగి అంటే దాన్ని భరించే పరిపక్వత కోహ్లీలో కనిపించలేదు" అని అన్నాడు.

టీమిండియా తొలి పోరుకు

టీమిండియా తొలి పోరుకు

వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇప్పటికే టోర్నీలో రెండు ఓటములతో దెబ్బతిన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

Story first published: Wednesday, June 5, 2019, 14:19 [IST]
Other articles published on Jun 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+