

టీ20 ప్రపంచకప్ బౌలింగ్ లైనప్లో
టీ20 ప్రపంచ కప్ కోసం భారత పేస్ లైనప్ గురించి క్రికెట్.కామ్‌తో మాట్లాడిన శ్రీధర్.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను ఎంపిక చేశాడు. భువనేశ్వర్ కుమార్.. పాత, కొత్త బంతులతో రాణించగలడు. షమీ ప్రత్యర్థిపై ఎటాకింగ్ చేయగల బౌలర్. బుమ్రా మిడిల్, డెత్ ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోగలడు. హార్దిక్ పాండ్యాలో భారత్‌కు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా ఉన్నాడని టీ20 ప్రపంచకప్ బౌలింగ్ లైనప్‌లో ఉండాల్సిన పేసర్ల గురించి ప్రస్తావించాడు.

అత్యుత్తమ స్థితిలో అతను ఉన్నాడు
‘మనకు పుష్కలమైన ఆప్షన్లు ఉన్నాయి. నేను సూటిగా చెబుతున్నా. మన భారత బౌలింగ్ లైనప్లో టాప్ త్రీ ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, షమీ, భువీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భువీ ఒక సంపూర్ణ బ్యాంకర్, న్యూ-బాల్ బౌలర్ అలాగే డెత్-ఓవర్ బౌలర్ కూడా. అతను తన ఫిట్‌నెస్ పరంగా ప్రస్తుతం అత్యుత్తమ స్థితిలో ఉన్నాడు.' గత ప్రపంచకప్ నుంచి భువనేశ్వర్ 18ఇన్నింగ్స్‌లలో ఓవర్‌కు 6.94ఎకానమీతో 23వికెట్లు తీశాడు. భువనేశ్వర్ ప్రస్తుతం టీ20ల్లో భారత అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

ఆరు బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి
‘మన వద్ద షమీ ఉన్నాడు, అతను కొత్త బంతితో ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లకు సవాలు విసిరే బాల్స్ వేయగలడు. భువీని, షమీని మీరు కలిపి స్పెల్ వేయించొచ్చు. బుమ్రా ఏం చేయగలడో తెలిసిందే. ఇప్పుడు హార్దిక్ బౌలింగ్ చేయడం చూశాం. అతనిలోనూ లైన్ అండ్ లెంత్ బౌలర్ ఉన్నాడు. జడేజా ఆల్‌రౌండర్. చాహల్ స్పిన్నర్. ఇలా మనకు ఆరు బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో ఆడడానికి అనుభవం నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు కావాలి.' అంటూ శ్రీధర్ పేర్కొన్నాడు. షమీ నవంబర్ 2021నుంచి భారతదేశం తరపున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున విశేషంగా రాణించాడు.


Click it and Unblock the Notifications












