Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK: వివాదంలో ఇరుక్కున్న అశ్విన్.. సీఎస్కే మ్యాచులకు గుడ్ బై!!

ఐపీఎల్ 2025లో ఎన్నో అంచనాలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన ఆఫ్ ‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆశించినంత స్థాయిలో ఆడట్లేదు. బౌలింగ్ లో అశ్విన్ సగటు 40 ఉండగా, ఎకానమీ రేటు 9కి పైగా ఉంది. దీంతో అతడిపై విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ మరో కొత్త వివాదంలోకి చిక్కుకున్నాడు. దీంతో విమర్శలు మరింత ఎక్కువై.. అశ్విన్ పై ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కొత్త వివాదం ఇదే?
ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అశ్విన్ మాత్రమే కాదు మొత్తం సీఎస్కే మొత్తం జట్టు కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓడింది. పాయింట్ల పట్టికలో కూడా కిందకి పడిపోయింది. జట్టులోని కీలక బ్యాటర్లంతా చేతులెత్తేస్తున్నారు. కేవలం ఆ జట్టులోని స్పిన్నర్‌ నూర్‌ అహ్మద మాత్రమే రాణిస్తున్నాడు. జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కానీ అశ్విన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ మాత్రం నూర్ అహ్మద్ పై తీవ్ర విమర్శలు చేసి వివాదంలో ఇరుక్కుంది.

R Ashwin s YouTube channel decided not to cover CSK matches of IPL 2025


కొనుగోలు చేయాల్సింది కాదు...
ఇటీవలే ఏప్రిల్ 5న దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. అప్పుడు రవించంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఒక ప్యానలిస్టు.. నూర్‌పై ఇష్టమొచ్చి మాట్లాడాడు. అసలు అతడిని కొనుగోలు చేయాల్సింది కాదని తీవ్ర పేర్కొన్నాడు. దీంతో రవిచంద్రన్ తో పాటు అతడి ఛానల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అశ్విన్‌ ఛానల్‌.. ఈ విషయంపై వివరణ ఇచ్చింది. ఇకపై చెన్నై మ్యాచ్‌ల కవరేజీకి దూరంగా ఉంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అశ్విన్‌కు ఈ విమర్శలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.
Story first published: Monday, April 7, 2025, 17:00 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+