Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అశ్విన్ ఆ మైలురాయిని అందుకుంటాడు, నా రికార్డు కూడా బద్దలు కొడతాడు'

R Ashwin

హైదరాబాద్: రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో తన రికార్డుని అధిగమిస్తాడని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్‌ పేర్కొన్నాడు. సఫారీలతో విశాఖ టెస్టు వేదికగా జరిగిన తొలి టెస్టులో అరుదైన రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. 66 మ్యాచ్‌ల్లోనే 350 వికెట్లు తీసి మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ సరసన నిలిచాడు.

దీనిపై ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో భజ్జీ మాట్లాడుతూ "స్వదేశంలో అశ్విన్‌ బౌలింగ్‌ సామర్థ్యంపై చాలా మంది మాట్లాడతారు. వారంతా కూడా ఒక్క విషయం గుర్తించుకోవాలి. ఈ పిచ్‌లపై ఇతర స్పిన్నర్లు కూడా బౌలింగ్‌ చేస్తారు. కానీ, అశ్విన్‌లా వారు వికెట్లు తీయలేదు" అని తెలిపాడు.

భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు

భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు

భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ప్రస్తుతం హర్భజన్‌ సింగ్(417) కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అనిల్‌కుంబ్లే(619), కపిల్‌దేవ్‌(434) ముందు ఉన్నారు. అశ్విన్‌ కచ్చితంగా తన రికార్డు బద్దలు కొడతాడని, పూర్తి ఫిట్‌నెస్‌తో దీర్ఘకాలం కొనసాగితే 600 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని తెలిపాడు.

350 వికెట్లు పడగొట్టిన అశ్విన్

350 వికెట్లు పడగొట్టిన అశ్విన్

కాగా, భారత్ తరుపున టెస్టుల్లో ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టిన అశ్విన్ స్వదేశంలో ఆడిన 39 మ్యాచ్‌ల్లోనే 242 వికెట్లు పడగొట్టడం విశేషం. మిగతా 108 వికెట్లు విదేశీ పిచ్‌లపై సాధించాడు. అయితే, ఇతరుల కన్నా ఎక్కువ వికెట్లు అశ్విన్ ఎలా తీయగలుగుతున్నాడన్న ప్రశ్నకు భజ్జీ తనదైన శైలిలో స్పందించాడు.

అశ్విన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం

అశ్విన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం

అశ్విన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుందని, పిచ్‌ మారేటప్పుడు ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి బాగా తెలుసని ఈ సందర్భంగా భజ్జీ చెప్పుకొచ్చాడు. పిచ్‌ల స్వభావంపై అవగాహన ఉండాలని, ఎప్పుడు ఎక్కడ ఎలా వేయాలో బౌలర్లకు తెలుసుండాలని భజ్జీ అన్నాడు. ఇతరులకు, అశ్విన్‌కు అదే తేడా అని భజ్జీ వివరించాడు.

Story first published: Wednesday, October 9, 2019, 8:44 [IST]
Other articles published on Oct 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+