Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

32వ పడిలోకి అశ్విన్‌: ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ravichandran Ashwin Turns 32 : Wishes Pour In For India Spinner
R Ashwin turns 32; wishes pour in for India spinner

హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం (సెప్టెంబర్ 17)న 32వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అశ్విన్‌కు ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

భారత్ తరుపున ఇప్పటివరకు 62 టెస్టు మ్యాచ్‌లాడిన అశ్విన్ 2.87 ఎకానమీ, 53.4 స్ట్రయిక్ రేట్‌తో 327 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో నాలుగు టెస్టులాడిన అశ్విన్ 11 వికెట్లు తీసి రెడ్ బాల్ క్రికెట్‌లో తన అవసరం ఇంకా ఉందని నిరూపించుకున్నాడు.

టెస్టుల్లో అశ్విన్ అత్యుత్తమం 7/59

టెస్టుల్లో అశ్విన్ అత్యుత్తమం 7/59. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను 26 సార్లు... పది వికెట్లను 7 సార్లు సాధించాడు. అక్టోబర్‌ నెలలో స్వదేశంలో వెస్టిండిస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ శ్విన్ ఆడబోయే తదుపరి సిరిస్ కావడం విశేషం. ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టును అశ్విన్ మిస్ అయిన సంగతి తెలిసిందే.

అశ్విన్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు

ఇక, సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండా నాలుగో టెస్టులో బరిలోకి దిగిన అశ్విన్ ఆశించిన మేరకు బంతిని తిప్పలేకపోయాడు. అయితే, ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో అశ్విన్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

టెస్టులకే పరిమితమైన అశ్విన్

చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్‌లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అశ్విన్, జడేజా కేవలం టెస్టులకే పరిమితమైన సంగతి తెలిసిందే. భారత్ తరుపున అశ్విన్ చివరిసారిగా జూన్ 2017లో వెస్టిండిస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు.

అశ్విన్‌కు సెహ్వాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

ఐపీఎల్ 2018 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టుకు మెంటార్‌గా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్వవహారిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా అశ్విన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Story first published: Monday, September 17, 2018, 13:42 [IST]
Other articles published on Sep 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+