న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌ మంచి ప్రాక్టీస్: డేవిడ్‌ మిల్లర్‌

R Ashwin the all-rounder has been a huge asset says David Miller

ప్రపంచకప్‌ 2019కు ముందు ఐపీఎల్‌ మంచి ప్రాక్టీస్ అని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ అభిప్రాయపడ్డాడు. మొహాలీ వేదికగా మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పంజాబ్ తన ఖాతాలో ఐదో విజయాన్ని వేసుకుని ప్లే ఆఫ్ అవకాశాలను సుగమనం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం డేవిడ్‌ మిల్లర్‌ మాట్లాడారు.

 గాయాలవడం సర్వ సాధారణం:

గాయాలవడం సర్వ సాధారణం:

'ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌ మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌కు ఎంపికయిన అందరు ఆటగాళ్లు సద్వినియోగపరుచుకోవాలి. ఆటగాళ్లు ఎవరైనా గాయాల బారిన పడితే.. ఐపీఎల్‌ను తప్పుబట్టలేం. క్రికెట్‌లో ఆటగాళ్లకు గాయాలవడం సర్వ సాధారణం' అని మిల్లర్‌ పేర్కొన్నారు.

182 పరుగులు పెద్ద లక్ష్యమే కాదు:

182 పరుగులు పెద్ద లక్ష్యమే కాదు:

'పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. 182 పరుగులు పెద్ద లక్ష్యమే కాదు. ఛేదనలో ప్రత్యర్థికి 8 వికెట్లు చేతిలో ఉన్నప్పుడు.. మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదు. కానీ మా బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశారు. పరుగులు చేస్తున్న బ్యాట్స్‌మెన్‌ను కూడా అశ్విన్‌ తన వైవిధ్య బంతులతో పెవిలియన్‌కు చేర్చుతాడు. పిచ్‌ పరిస్థితి చూసి చివరి ఓవర్‌లో 6-7పరుగులు వస్తాయనుకున్నాం.. కానీ అశ్విన్‌ 15 పరుగులు సాధించాడు. జట్టును ముందుండి నడిపించడంలోనూ అశ్విన్‌ దిట్ట. పంజాబ్ జట్టుకు అశ్విన్‌ పెద్ద బలం' అని మిల్లర్‌ అన్నారు.

మిల్లర్‌ దూకుడు:

మిల్లర్‌ దూకుడు:

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ లోకేశ్‌ రాహుల్‌ 52(47 బంతుల్లో; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్‌ 40(27 బంతుల్లో; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ అశ్విన్‌ 17 నాటౌట్‌ (4 బంతుల్లో; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పరుగులు చేసారు. మిల్లర్‌ దూకుడుగా ఆడి పంజాబ్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓటమిని ఎదుర్కొంది. రాహుల్‌ త్రిపాఠి 50(45 బంతుల్లో; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో స్టువర్ట్ బిన్నీ (11 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. అశ్విన్ 2 వికెట్లు తీశాడు. బ్యాట్, బంతితో మెరిసిన అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, April 17, 2019, 15:46 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X