'తలా అశ్విన్': ఐసీసీ అవార్డుల్లో అశ్విన్ క్లీన్ స్వీప్
హైదరాబాద్: 2016 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం వార్షిక అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్, టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ రెండు టాప్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.
30 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ కింద ఇచ్చే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు. దీంతో పాటు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా అశ్విన్ సొంతం చేసుకున్నాడు. ఇక ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడికే చోటు దక్కడం విశేషం.
ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లాండ్ ఆటగాళ్లు నలుగురు, భారత్, శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున చోటు దక్కించుకున్నారు. ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అలెస్టర్ కుక్ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12వ ఆటగాడిగా ఐసీసీ ఎంపిక చేసింది.
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 సంవత్సరానికి ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ ఎంపిక చేసిన వన్డే జట్టులో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు కూడా చోటు దక్కింది. ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రెండు టాప్ అవార్డులను అశ్విన్ గెలుచుకుని అరుదైన ఘనతను కూడా సాధించాడు.
రాహుల్ ద్రవిడ్ తర్వాత ఒక ఏడాదిలో రెండు అవార్డులను సొంతం చేసిన రెండో భారత క్రికెటర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ డీకాక్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుని పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ సొంతం చేసుకున్నాడు.
పాకిస్ధాన్ తరుపున ఈ అవార్డుని సొంతం చేసుకున్న మొట్టమొదటి క్రికెటర్ మిస్బా ఉల్ హక్ కావడం విశేషం. ఆప్ఘనిస్ధాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మొహమ్మద్ షహ్జాద్ ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. వెస్టిండిస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్ ఐసీసీ టీ20 ఫెర్మామ్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు.
హార్భజన్ సింగ్
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్న టీమిండియా ఆఫ్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు వెటరన్ ఆటగాడు హార్భజన్ సింగ్ అభినందనలు తెలిపాడు.
అనిల్ కుంబ్లే
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు అశ్విన్ అర్హుడే. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అభినందనలు.
శిఖర్ ధావన్
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న అశ్విన్‌కు శిఖర్ ధావన్ అభినందనలు తెలిపాడు.
ఆర్ శ్రీధర్
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న అశ్విన్‌కు టీమిండియా కోచ్ ఆర్ శ్రీధర్ అభినందనలు తెలిపాడు.
హర్షా భోగ్లే
నిజమైన మ్యాచ్ విన్నర్. అద్భుతమైన హార్డ్ వర్క్‌కు తగిన ప్రతిఫలమని హర్షా భోగ్లే అన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్
తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ అశ్విన్ పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications