18 ఏళ్ల కుర్రాడి ప్రాణాలతో ఆటలా? సీఎస్కేపై స్టార్ క్రికెటర్ ఫైర్!
సీఎస్కే యాజమాన్యం తీరుపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 18 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో ఇబ్బంది పడుతున్నా.. అతడిని అలాగే ఆడించడంపై అశ్విన్ మండిపడ్డాడు. మోకాలికి భారీ పట్టి కట్టుకుని బ్యాటింగ్‌కు వచ్చిన ఆయుష్ మాత్రే.. కనీసం సరిగ్గా నిలబడలేకపోయినా జట్టు యాజమాన్యం అతడిని మైదానం వీడమని చెప్పకపోవడం పట్ల అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ లో ఆయుష్ మాత్రే రన్ తీసే సమయంలో స్పష్టంగా కుంటుతూ కనిపించాడని.. ఫిజియో వచ్చి చికిత్స చేసినా అతడిని కొనసాగించడం కరెక్ట్ కాదని అశ్విన్ విమర్శించాడు. అనంతరం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆయుష్ మాత్రే నడవడానికే కష్టపడుతుంటే.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వేగంగా సింగిల్ తీయాలని అతడిని ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో ఆయుష్ మాత్రే అతి కష్టం మీద పరుగు పూర్తి చేసి రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత బంతికే ఓ భారీ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. 17 బంతుల్లో 30 పరుగులు చేసిన ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ తీవ్రమైన నొప్పితో ముగిసింది.

రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "ఆయుష్ మాత్రే గాయం ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలియదు కానీ, అది క్రాంప్స్ (నరాలు పట్టేయడం) మాత్రం కాదు. ఎందుకంటే ఆయుష్ మాత్రే అప్పటివరకు ఫీల్డింగే చేయలేదు. అంతగా ఇబ్బంది పడుతున్నప్పుడు యాజమాన్యం అతడిని 'రిటైర్డ్ హర్ట్'గా వెనక్కి ఎందుకు పిలవలేదో అర్థం కావడం లేదు. ఓ యువ ఆటగాడి ఫిట్‌నెస్ విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడం దిగ్భ్రాంతికరం. కనీసం మైదానంలో ఉన్న ఫిజియో అయినా అతడిని ఆపాల్సింది" అని అశ్విన్ మండిపడ్డాడు.
ఈ సీజన్‌లో ఆయుష్ మాత్రే చెన్నై జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడని.. అలాంటి ఆటగాడి కెరీర్‌తో ఇలా ఆటలాడటం సరికాదని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఆయుష్ మాత్రే ఇబ్బంది పడుతుంటే కామెంటరీ బాక్స్‌లోని వారందరూ నోరెళ్లబెట్టి చూశారని, ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గాయం కారణంగా ఆయుష్ మాత్రే మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చనే ఆందోళనను కూడా రవిచంద్రన్ అశ్విన్ వ్యక్తం చేశాడు. ఒకవేళ అతడికి తీవ్రమైన గాయమైతే దానికి జట్టు యాజమాన్యానిదే బాధ్యత అని ఆయన పరోక్షంగా హెచ్చరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications