Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కౌంటీ క్రికెట్: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన అశ్విన్

హైదరాబాద్: కౌంటీ క్రికెట్ అరంగేట్రంలోనే టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. కౌంటీల్లో వార్సెష్టర్‌షైర్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌ గ్లూసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. దీంతో కౌంటీల్లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను సాధించిన అరుదైన ఘనతను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో రెండు వికెట్లను వరుసగా తీసిన అశ్విన్ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు.

 R Ashwin shines on County debut for Worcestershire, grabs eight wickets in the match

ఇక రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లపాటు బౌలింగ్ వేసి ఎనిమిది మెయిడిన్లు వేసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 401 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లూసెస్టర్‌షైర్‌ 211 పరుగులకే ఆలౌటైంది. దీంతో వార్సెష్టర్‌షైర్‌ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

స్కోర్లు సంక్షిప్తం: Worcestershire 363 and 295/8d. Gloucestershire 258 and 211 (Roderick 47; Ashwin 5/68).

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+