
250 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా డెన్నిస్ లిల్లీ
టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా డెన్నిస్ లిల్లీ పేరిట రికార్డు ఉంది. 48 టెస్టుల్లో లిల్లీ ఈ రికార్డుని నెలకొల్పాడు. ఇక డెన్నిస్ లిల్లీ రికార్డుని అధిగమించడానికి అశ్విన్‌కు మరో మూడు టెస్టు మ్యాచ్‌లు అదనంగా ఉన్నాయి. గతేడాది ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

44 టెస్టు మ్యాచ్‌లాడి 248 వికెట్లు
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే ఏకైక టెస్టులో ఆ రెండు వికెట్లను పడగొట్టి డెన్నిస్ లిల్లీ రికార్డుని అధిగమించినా ఆశ్చర్య పోవాల్సిన అవసం లేదు. 44 టెస్టు మ్యాచ్‌లాడిన అశ్విన్ 24.96 యావరేజితో 248 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 24 సార్లు ఐదు వికెట్లను సాధించాడు.

ఒక్క ఇంగ్లాండ్ సిరిస్‌లోనే 28 వికెట్లు
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అశ్విన్ 28 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో కూడా టీమిండియా అదే జోరుని కొనసాగించనుంది. ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసేందుకు తానెంతో ఉత్సుకతతో ఉన్నట్లు మీడియా సమావేశంలో అశ్విన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు
ఇక గతేడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 200వ వికెట్ తీసుకుని టెస్టుల్లో అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. 37 టెస్టుల్లో ఈ ఘనతను సాధించిన అశ్విన్ పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నిస్ లిల్లీల(38 టెస్టుల్లో) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.


Click it and Unblock the Notifications











